◆రైతు భరోసా పథకం వెంటనే ప్రవేశపెట్టాలి..
◆6 గ్యారంటీలు తక్షణమే అమలు చేయాలి…
◆సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి…
◆సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
నేటి గదర్ న్యూస్,మణుగూరు:
రైతులకు వెంటనే రుణమాఫీ చేసి కొత్త రుణాలు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు శనివారం శ్రామిక భవనంలో ఉప్పతల నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ తక్షణమే మహిళలకు 2500 బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగానే బిజెపికి బలం పెరిగిందన్నారు నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న ప్రభుత్వం అమలు చేయలేదన్నారు కొత్త ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా విఫలమైందన్నారు రైతు రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు కొత్త రుణాలు అందించాలన్నారు రైతు భరోసాని వెంటనే ప్రవేశపెట్టి రైతులను ఆదుకోవాలని అన్నారు కౌలు రైతులకు,వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న పథకాలు వెంటనే అమలు చేయాలన్నారు రైతులకు అందుబాటులో విత్తనాలు ఎరువులు, పురుగుమందులు ఇబ్బందులు లేకుండా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వర్షాకాలంలో సీజన్ వ్యాధుల ప్రమాదం నుండి ప్రజలను రక్షించేందుకు ఆసుపత్రులలో అందుబాటులో వైద్యులు మందులు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు గ్రామీణ , పట్టణ ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కోడిశాల రాములు, సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు దామల్ల లెనిన్ బాబు, సత్ర పల్లి సాంబశివరావు, నాయకులు అల్లె సుధాకర్ మడి నరసింహారావు, నందం ఈశ్వరరావు,తోటపద్మ,బొల్లం రాజు,పల్లపు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.