నేటి గద్దర్ న్యూస్, బోనకల్/ మధిర.
యువత మత్తు పదార్థాలకు గంజాయికి దూరంగా ఉండాలని మధిర రూరల్ ఎస్ఐ లక్ష్మీ భార్గవి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవుతున్నాయని అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను , కుటుంబాలను పాడు చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి ఫై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. ఇప్పటికే బృందాలుగా ఏర్పడి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.
Post Views: 49