◆ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్
నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
✍️సతీష్ కుమార్ జినుగు
మాదాక ధ్రవ్యల పట్ల ప్రజలందరూ అవగాహనా పెంచుకోవటం అవసరం అని ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ ధత్ అన్నారు. బుధవారం ఖమ్మం పట్టణంలో స్థానిక సర్ధార్ పటేల్ స్టేడియం నుంచి లకరం ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా నేటి గదర్ ప్రతినిధితో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ మాదాక ధ్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా కు వ్యతిరేకంగా అవగాహనా ర్యాలీ నిర్వహించడం జరిగింది అన్నారు. ప్రజలందరికీ వీటి పట్ల అవగాహన అవసరం అన్నారు. మరి ముఖ్యంగా యువత పెడదారి పట్టకుండా వీటి పట్ల అవగాహనా పెంచాలని కోరారు.యువత నేడు మాదాక ధ్రవ్యల మత్తులో పడి నిండు జీవితాన్ని నాశనం చేసుకొంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి యువత వెన్నెముక వంటి వారు, వారు దేశ సేవా గురించి అలోచించలి గాని, మత్తు పదార్ధాలతో జీవితన్ని చిత్తూచేసుకోవద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మరియు యువత అందరూ పాల్గొన్నారు.