◆అనుమతులు అయిపోయిన ఇసుక క్వారీలో డంపింగ్
◆అధికారులు ఎక్కడ?
★ముడుపుల అధికారుల నోర్లు ముపించారా?
★వెంకటాపురం మండలంలో ఇసుక క్వారీలో అర్థరాత్రి నుంచి అక్రమ ఇసుక తొలకాలు
నేటి గద్దర్, వెంకటాపురం:
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఇసుక క్వారీకి అనుమతులు అయిపోయిన తర్వాత మళ్లీ ఇసుక డంపు చేస్తున్నారు. అనుమతులు లేకుండా ఇలా ఎలా చేస్తారని,అనుమతులు లేని పక్షంలో మూసివేయాలని అధికారులు చెప్పారా, లేక ముడుపుల, మల్లెలు తీసుకొని సహకరిస్తున్నారా, అనేక అనుమానాలు ప్రజలలో వెల్లువెత్తుతున్నాయి. రూల్స్ ప్రకారం చెయ్యాలని చెప్పవలసిన అధికారులే, చెవి చాటున జరుగుతుందనే ఆరోపణలు లేకపోలేదు, ఇంత జరుగుతున్న పై అధికారులు పట్టించుకోవడంలేదని మౌనం వీడాలని ప్రజలు అంటున్నారు. ఈసీ, సి ఎఫ్ ఓ, సి ఎఫ్ ఈ, పూర్తి అయిపోయినాక భారీ యంత్రాల సహాయంతో డంపు చేసిన ఎండీఎల్ ను సీజ్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.