మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు : అదనపు ఎస్సై నాగ బిక్షం
నేటి గద్దర్, జూన్ 28,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516 :
మైనర్లు వాహనాలు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారి తల్లిదండ్రుల పై సైతం చట్టరీత్యా చర్యలకు వెనకాడబోమని బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ అదనపు ఎస్సై నాగబిక్షం అన్నారు. శుక్రవారం బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక సెంటర్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులతో ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనాలు డ్రైవింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ను వాడాలని సూచించారు. మద్యం త్రాగి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలను ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, మైనర్లు డ్రైవింగ్ చేసుకుంటూ పట్టుబడతే వాహన యజమానిపై, తల్లిదండ్రుల పై సైతం చట్టరీత్యా చర్యలు తప్పవని ఆయన అన్నారు. వాహనాలు నడిపేవారు బండికి కావలసిన అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా నెంబర్ ప్లేటు సక్రమంగా వినియోగించాలని, నెంబర్ ప్లేట్ లేకపోయినా, నెంబర్ ప్లేట్ ను వంచిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణాలు చేయాలని అదనపు ఎస్ఐ నాగబిక్షం వాహనదారులకు తెలిపారు.