హ్యాట్సాఫ్ టీం ఇండియా
నేటి గదర్ న్యూస్,పాలేరు ప్రతినిధి:
టీ ట్వంటీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం పట్ల తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 17 ఏళ్ల నిరీక్షణ తరువాత టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ విజయం తనకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ బృందానికి అభినందనలు తెలిపారు. టీం ఇండియా ప్రపంచ కప్ గెలవడం పట్ల దేశ ప్రజలకు , క్రికెట్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం రేపటి భవిష్యత్ క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని ఆకాక్షించారు.
Post Views: 136