– 5గురు జవాన్ల మృతి, 15 మందికి గాయాలు
– పోలీసులు మాకు శత్రువులు కాదు
– నకిలీ నోట్లు అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
– నకిలీ నోట్లు ముద్రించేవారు బిజెపిలో ఉన్నారు
– CPI (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో సమత
నేటి గద్దర్, ప్రతినిధి :
‘కాగర్’ ఊచకోతకు ప్రతిస్పందనే , జూన్ 23న, మా పిఎల్ జిఎ సిలంగర్- టేకులగూడెం మధ్య సైనిక వాహనాన్ని పేల్చివేత, ఈ సంఘటనలో 5 మంది సైనికులు మరణించగా 15 మంది గాయపడ్డారని CPI (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో సమత ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. CPI (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో సమత పేరుతో విడుదలైన పత్రిక ప్రకటనలో పేర్కొని ఉన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి… ‘కాగర్’ ఊచకోతకు ప్రతిస్పందనగా జరుగుతున్న సంఘటనలకు ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, పోలీసు మంత్రి విజయ్ శర్మ బాధ్యత వహించాలన్నారు. మోడీ – షాల కేంద్ర ప్రభుత్వం, విష్ణుదేవ్ సాయి, విజయ్ శర్మల రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జనవరి 2024 నుండి కగార్ మారణకాండను ప్రారంభించాయని, ఇందులో 70 ఏళ్ల వృద్ధుడు 6 నెలల బాలికతో పాటు వ్యక్తులను కూడా చంపుతున్నారని ఆరోపించారు. ఈ మారణకాండకు ప్రతిస్పందనగా, మా PLGA జూన్ 23న సిల్గర్ – టేకుల్గూడ మధ్య సైనికులతో నిండిన సైనిక వాహనాన్ని, ఇతర వస్తువులను పేల్చివేసింది, ఇందులో 5 మంది సైనికులు మరణించగా, 15మంది సైనికులు గాయపడ్డారని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దాచి పెట్టిందని, వారికి సత్యాన్ని అంగీకరించే అలవాటు లేదని విమర్శించారు. ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం అబద్ధాలు, దోపిడీపై ఆధారపడి ఉన్నదని, ఈ ప్రభుత్వం ఎప్పుడూ కార్పొరేట్ కంపెనీలకు సేవ చేయడంలో నిమగ్నమై ఉంటుందని దుయ్యబట్టారు. ఈ ఘటనలో మరణించిన, గాయపడిన జవాన్ల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని అని లేఖలో పేర్కొన్నారు. పోలీసులు మాకు శత్రువులు కాదు, ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం మిమ్మల్ని కార్పొరేషన్ల కోసం ఉపయోగిస్తోందిని, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదే. కానీ దేశాన్ని దోచుకుంటున్న అంబానీ, అదానీ లాంటి దోపిడిదారుల వల్ల మీరు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం అని, పోలీసు సోదరుల కుటుంబాలు కూడా ‘కాగర్’ హత్య కేసుకు వ్యతిరేకంగా తమ స్వరం పెంచాలి అని పిలుపునిచ్చారు. నకిలీ కరెన్సీ నోట్లు కు సంబంధించి పోలీసులకు ప్రింటర్, పేపర్ దొరికిందని పోలీసులు, ప్రభుత్వం మావోయిస్టులు నకిలీ నోట్లను ముద్రిస్తున్నారని నిరాధారమైన ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకు ముందు మా కార్యకర్తలు చాలా మందిని అరెస్టు చేశారు, ఎవరి దగ్గర కూడా ఒక్క నకిలీ నోటు కూడా దొరకలేదని పేర్కొన్నారు. నకిలీ నోట్లు ముద్రించే వారు, మోసాలు చేసేవారు, బ్యాంకులను దోచుకునే వారు బీజేపీలోనే ఉన్నారని దుయ్యబట్టారు. మంత్రి బావ, మంత్రి సోదరుడు, మంత్రి తనయుడు నకిలీ నోట్లు ముద్రించి అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని లేఖలో తెలిపారు. నేడు 300 మందికి పైగా లోక్ సభ సభ్యులపై క్రిమినల్ కేసులు, స్కామ్ కేసులు ఉన్నాయని అన్నారు. అబద్ధాలు చెప్పడం, అబద్దాలు పదే పదే ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడంలో బీజేపీ అగ్రగామిగా మారిందని దీన్నిబట్టి తెలుస్తోందని, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసు అధికారులు కూడా అదే పని చేస్తున్నారని పేర్కొన్నారు. కూలీలు, రైతులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, యువకులు, మేధావులు, పాత్రికేయులు, వైద్యులు, న్యాయవాదులు, గిరిజనులు, దళితులు, మహిళలు ఈ తప్పుడు ప్రచారాన్ని బట్టబయలు చేసి ‘కాగర్’ మారణకాండకు వ్యతిరేకంగా గళం విప్పాలని లేఖలో కోరారు.