భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీనివాస్ అదృశ్యమై మహబూబాద్ లో ఆచూకీ లభ్యం.కలుపు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసిన SI.మహబూబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసిన వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదివారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు వరంగల్ కి తరలించినట్లు సమాచారం. ఆ ఎస్సై పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియ వచ్చింది. ఆ ఎస్సై ఆత్మహత్య యత్నానికి కుటుంబ కలహాలా? రాజకీయ ఒత్తిళ్లా? ఉన్నతాధికారుల వేధింపులా? కారణాలు ఏమి అయి ఉండవచ్చునని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఓ ఎస్ ఐ స్థాయి అధికారి ఆత్మహత్యయత్నానికి పాల్పడడం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయంగా మారింది.
Post Views: 980