అమానుష దాడి… భర్త చనిపోయి కర్మకాండలు చేస్తుండగా భార్య, కుటుంబ సభ్యులపై దాడి
★కలకోట గ్రామానికి చెందిన కొంతమంది యువకులు సుజాత అనే మహిళపై వారి కుటుంబం పై దాడి కి పాల్పడ్డారు.
★మధిర రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
నేటి గద్దర్ న్యూస్, బోనకల్:
భర్త చనిపోయి సాంప్రదాయంగా కర్మకాండలు చేసుకుంటుంటే భార్యపై విచక్షణ రహితంగా దాడి జరిగింది.సిరిపురం ఏటి వద్ద పొలాలలో సుజాత అనే మహిళ కుటుంబాన్ని ఉరికిచ్చి కొట్టిన వైనం.
మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన సుజాత అనే మహిళకు కలకోట గ్రామానికి చెందిన జార్జి అనే వ్యక్తికి కొద్దిరోజుల క్రితం పెద్దమనుషుల సమక్షంలో వివాహం జరిగింది అయితే వీరి కుటుంబంలో కొన్ని వివాదాల కారణంగా కొంచెం వెడబాటుగా ఉంటున్నారు .ఈ క్రమంలో వీరిద్దరికి ఒక పాప ఉంది. గత 11 రోజుల క్రితం జార్జి అనే వ్యక్తికి తల్లాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందాడు. నిన్నటితో 11 రోజులు కావడం వలన హిందూ సాంప్రదాయ ప్రకారం భార్య కర్మకాండలో వారి స్వగ్రామం సిరిపురం ఏటి వద్ద సాంప్రదాయ గా సిరిపురం ఏటి వద్ద అంటూ తీర్చుకుంటూ కర్మకాండలో చేసుకుంటుండగా… కలకోట గ్రామానికి చెందిన కొంతమంది యువకులు సుజాత కర్మకాండలు చేసే వద్దకు వచ్చి విచక్షణ రైతంగా కొట్టి వారి తల్లిదండ్రులను కొట్టి ఉరికిచ్చి చంపే ప్రయత్నం చేశారని బాధితురాలు సుజాత వాపోతోంది. నా భర్త చనిపోయి నేను కర్మ కండలు నిర్వహించుకుంటే మాకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి మా కుటుంబంపై నాపై దాడి చేశారని మధిర రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో అధికారులు న్యాయం చేయాలని సుజాత కుటుంబం వేడుకుంటుంది.