★సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..
నేటి గదర్ న్యూస్ ,జులై 2 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):రూ.8వేల 500 కోట్లు ఖర్చు పెట్టిన ఒక్క ఎకరాకు గత పాలకులు నీళ్లు ఇవ్వలేదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు.మహబూబాబాద్ జిల్లా తోడేళ్లగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పాలేరు లింకు కాలువను పరిశీలించిన తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి… అనంతరం మీడియాతో మాట్లాడుతూ. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ,మహబూబాద్ జిల్లాలో కొంత ప్రాంతానికి సాగు నీరు అందించే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టు లక్ష్యం అని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రాజీవ్ – ఇందిరా సాగర్ పేరుతో పథకం ప్రారంభించినట్టు గుర్తు చేశారు. కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు పేరు మార్చి అంచనా వ్యయం పెంచిందని , అయిన ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారన్నారు.. సీతారామ ప్రాజెక్టు మొదలు పెట్టు ఇన్నేళ్ళు అవుతున్న కొంత ప్రాంతానికి ఇప్పటివరకు టెండర్లు పిలవలేదని అన్నారు.. ఇప్పటికే ట్రెయిల్ రన్ చేయడం జరిగింది త్వరలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు నీరు అందిస్తామని తెలిపారు.