★భద్రాచలం సబ్ కలెక్టర్ గా ఐఏఎస్ ఆఫీసర్ ని నియమించాలి
నేటి గదర్ న్యూస్, చర్ల:
చర్ల మండల కేంద్రంలో మడకం రాజశేఖర అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన ఆదివాసి చట్టాలు ఉన్నప్పటికీ పటిష్టమైన అమలుకు నోచుకోవడం లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు భద్రాచలం సబ్ కలెక్టర్లుగా ఐఏఎస్ ఆఫీసర్లుగా నియమించబడి షెడ్యూల్ ప్రాంత ఆదివాసి చట్టాలపై అవగాహన కలిగి పరిపాలన కొనసాగించి కొద్దో గొప్ప ఆదివాసులకు న్యాయం చేశారని అన్నారు.
ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసుల పట్టా భూములకు రక్షణ లేకుండా పోయిందని వలస గిరిజనేతరులు దౌర్జన్యంగా ఆదివాసుల భూములను దొడ్డి దారిన తప్పుడు పత్రాలను సృష్టించి ఏద్దే చ్ఛగా ఆక్రమిస్తా ఉంటే ఐటిడిఏ పిఓకు మొరపెట్టుకున్న ఆదివాసి పట్టాదారుడికి భూమిని అప్పగించే ప్రయత్నం చేయనందున నిరుత్యాయస్థితిలో ఆదివాసులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు
అశ్వాపురం మండలంలో ఉఇక లక్ష్మికి వారసత్వ పట్టా భూమి 0.17 కుంటలు భూమిలో రేకుల షెడ్డు నిర్మిస్తా ఉంటే ఆ భూమికి సంబంధంలేని గిరిజనేతరుడు ఆ భూమిని ఆక్రమించుటకు ప్రయత్నం చేస్తూ ఆ ఆదివాసి మహిళను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగం మొత్తం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు యొక్క కార్యక్రమంలో పాయం సన్యాసి కనితి సోమరాజు పూణేం బాబురావు కనితి మల్లయ్య బీ రబోయిన అరుణ గొంది శ్రీలత బీరబోయిన శేఖర్ తదితరులు పాల్గొన్నారు.