నేటి గదర్ న్యూస్ , ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు :
ఖమ్మం జిల్లా,కొణిజర్ల మండలం లొ,కొణిజర్ల, గోపవరం, గోపతి గ్రామం లొ పచ్చి రొట్ట విత్తనాలు వేసిన జనము, జీలుగా పంటను మండల అగ్రికల్చర్ ఆఫీసర్ బాలాజీ పరిసీలించటం జరిగింది, రైతులు మోతాదుకు మించి ఎరువులు, పురుగు మందులు, గుళికలు వెయటం వలన భూమి సహజ గుణం కోల్పోయింది , మరియు గ్రామాలలో పశువులు, గొర్రెలు, మేకలు తగ్గిపోవటం వలన పశువుల ఎరువు లేకపోవటం, వలన భూమి సారం పూర్తిగా తగ్గిపోయింది, చీడ పీడలు ఎక్కువ అయి దిగుబడులు తగ్గుతున్నాయి,
అందువలన రైతులను వ్యవసాయం వైపు ప్రోత్సహించిటానికి తెలంగాణ ప్రభుత్వం 60% సబ్సిడీ పై పచ్చి రొట్ట విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ఇవ్వటం జరిగింది, కొణిజర్ల లొ 600 క్యూంటాల్ జీలుగా 100 క్యూంటాల్ జనము ఇవ్వటం జరిగింది,
జీలుగా విత్తనాలు ఎకరాకు 10 నుండి 12 kgs వేసుకోవాలి, వేసిన తరువాత 40 నుండి 45 రోజుల లోపు రెండు కట్టలు సూపర్ వేసి రోటా విడర్ తో కలయ దున్నటం చెయ్యాలి, ఇలా చేయటం వలన ఒక ఎకరాకు పచ్చి రొట్ట పంట 8 నుండి 10 టోన్నులు వస్తే ఒక ఎకరాకు 25 నుండి 30 kgs నత్రజని ని నేరుగా భూమికి అందుస్తుంది అదే విదంగా చవుడు వున్నా భూమి లొ కొంత వరకు చవుడు ను తగ్గిస్తుంది.
జీలుగా పంట రోటా విడర్ తో కలయ దున్నిన రెండు మూడు రోజులలో నాటు వెయ్యవద్దు, ఒకవేళ్ల నాటు వేస్తే అది చనిపోతుంది. కారణం, జీలుగా మురిగే టప్పుడు మీతేన్ గ్యాస్ విడుదల అవుతుంది దీని వలన కలయ దీన్నిన 7 నుండి 10 రోజుల వరకు నాటు వెయ్యవద్దు
జనుమ పంట ఒక ఎకరాకు 10 నుండి 12 kgs విత్తనాలు అవసరం పడుతుంది ఈ పంట కూడా 45 రోజుల లోపు సూపర్ ఎరువు వేసి రోటా వీడిర్ కలయ దున్నలి ఒక ఎకరాలొ జనము పంటలో 8 నుండి 10 టోన్నుల పచ్చి రొట్ట వస్తే, సుమారుగా 15 నుండి 20 kgs నత్రజని నేరుగా భూమికి అందుస్తుంది.
అలాగే పిల్లి పెసర పంట కూడా ఒక ఎకరాకు 8 నుండి 10kgs విత్తనాలు అవసరం, ఇది కూడా ఒక ఎకరాకు 10 నుండి 14 kgs నత్రజని భీమికి అందిస్తుది
1).ఈ పచ్చి రొట్ట పంటలు వలన కలయ దున్నిన తరువాత వేసిన పంటకు 15 నుండి 25 % రాసాయనిక ఎరువులు పెట్టుబడి తగ్గుతుంది
2) చీడ పీడలు తగ్గుతాయి
3).నీటి నిలువా చేసుకొనే సామర్థ్యం పెరుగుతుంది
4).భూమి ఆరోగ్య గా ఉంటుంది
5).పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది
6). ఇలా ప్రతి సంవత్సరం వేసు కోవటం వలన భూమి సమతుల్యంగా ఉంటుంది
7).అన్నింటికీ కంటే ముఖ్య మయినది భూమి లొ కార్బన్ శాంతం పెరుగుతుంది
పండిన పంట కూడా మంచి నాన్యత గా ఉంటుంది రైతులు వరి వేసే రైతులు, మిరప వేసే రైతులు ఈ పచ్చి రొట్ట పంటలు వేసుకుంటారు,
రైతులు చేయకూడని పనులు
ఈ పచ్చి రొట్ట పంట 40 నుండి 45 రోజులకు కలయ దున్నలి లేకపోతె రైతుకి మరొక రూపం లొ నష్టం జరుగుతుంది, 40 నుండి 45 రోజుల వరకు జీలుగా పంట భీమికి నేరుగా నత్రజని అందిస్తుంది 45 రోజుల తరువాత భీమిలో వున్నా నత్రజనిని మళ్ళీ రిటర్న్ తీసుకుంటుంది అందుకని రైతులు పచ్చి రొట్ట పంట వేసిన వారు, కలయ దున్నిన తరువాత 10 రోజుల తరువాత మాత్రమే నాటు వేసుకోవాలి.
మరియు జనము, పిల్లి పెసర నారా వచ్చే వరకు పచ్చి రొట్ట పంటలు ఉంచ కూడదు.
ఈ రోజు కార్యక్రమం లొ MAO బాలాజీ, Aeo శ్రీనివాస రాజు మరియు రైతులు పాల్గున్నారు.