◆గ్రావెల్ మాఫియా వెనకాల గ్రామనాయకులు అండతో కొండ కబ్జా?
★ మాఫియా కు పోలీసులు ,రెవిన్యూ అండ దండలు?
★ కొండ మాయమవుతున్న అధికారులకు కనిపించడం లేదా
★ గ్రామస్తులు
నేటి గద్దర్ ,అనకాపల్లి న్యూస్:
అనకాపల్లి జిల్లా.పరవాడ:
మండలంలోని తాడి పంచాయితీ పరిధిలో సర్వేనెంబర్ 166 లో యదేచ్చగా జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలకు మైనింగ్ మరియు పోలీస్ అధికారులు అండదండలు దండలతో గ్రామ నాయకులు మొక్కు చూపించి యధావిధిగా కొండను మాఫియా చేస్తున్నారు ఎన్నిసార్లు మైనింగ్ వారికి ఫిర్యాదు చేసిన వాళ్లకు అందవలసింది మరింత ముడుపులు ప్రకారంగా తెలివిగా అందజేస్తున్నారు ముందే సమాచారం ఇస్తున్న మైనింగ్ అధికారులు అలాగే పోలీస్ వారు కూడా సర్వాండింగ్ కి తెలివిగా మెల్లిమెల్లిగా వెళ్తున్న పోలీసులు ఈ మాఫియా ముఠా ఇంతలాగా కొండను మాయం చేస్తున్న ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అందరూ మెండుగా ప్రవర్తించడం వల్లే. నాకేముంది మాకు కావలసింది ముడుపులు కొండ ఏమి నా సొత్తు కాదు కదా అది గవర్నమెంట్ ఏ కదా అని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తున్నారు దీని మీద రెవెన్యూ కూడా పట్టించుకోకపోవడం వల్లే బరితెగిస్తున్నారు మాఫియా ముఠా ఎన్ని ప్రభుత్వంలు మారిన మీరు పని వీరిదే కొన్ని కొండలకు గ్రావెల్ త్రవ్వకాలకు ఎటువంటి బిల్లులు లేవు ఒకవేళ ఇచ్చిన దానికన్నా ఇష్టం వచ్చినట్టుగా ఒక్క దగ్గర పాయింట్ చూపిస్తే ఇంకో దగ్గర తవ్వకాలు మొదలు పెడుతున్నారు సరైనటువంటి బిల్లు తార్ మార్ రికార్డులు సృష్టిస్తున్నారు కొన్ని పాత టెండర్ బిల్లులను ఉపయోగించి పరవాడ మండల గ్రామంలో ఇష్టానుసారంగా ప్రతిరోజు పగలు రాత్రి తేడా లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ కొండలను పిండి చేస్తున్నారు. పెద్ద పెద్ద జెసిబిలతో 166 లో పరిమితికి మించి తవ్వకాలు జరిపి గ్రామం గుండా ఫార్మా సిటీలోని పరిశ్రమలకు ఈ గ్రావెల్ తరలించి కోట్లు సంపాదిస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్ కు అధికారులు అండదండలు మెండుగా ఉన్నాయని ఆరోపణలు వెళ్ళు వెత్తుతున్నాయి. అదేవిధంగా ప్రతిరోజు గస్తీలు చాలా పకడ్బందీగా కాస్తున్నామంటూ ప్రచారం చేస్తే పోలీసు అధికారులు ఫిర్యాదులు అందిన వారికి వత్తాసు పలకడం పై భిన్నభిప్రాయాలు ఉన్నాయి. ప్రతిరోజు గ్రామం గుండా పగలు రాత్రి తేడా లేకుండా వందలాది లారీలు విపరీతమైన శబ్దాలతో ప్రయాణం చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులను గురి చేస్తున్నారు. ఒక పక్క ఫార్మా కాలుష్యం మరోపక్క కొండలు తవ్వకాల ద్వారా వచ్చే శబ్దాలతో తాడి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్టీలు అడ్డం పెట్టుకొని వారి ఇష్టం వచ్చినట్లు గ్రావలను తవ్వి కోట్లు సంపాదిస్తూ, అధికారులకు ముడుపులు చెల్లిస్తూ వారి పబ్బం గడుపుకుంటున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ ప్రభుత్వంలో ఉండి నాయకులుగా చలామనయి మళ్ళీ ప్రభుత్వం మారిన వెంటనే ఈ పార్టీలో చేరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల విలువైన గ్రావెల్ ని అమ్ముకుంటున్న ఇటువంటి నాయకులు వలన స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏవైనా మైనింగ్ అధికారుల లంచాల కక్కుర్తి వలన కోట్ల విలువైన గ్రావెల్ ఈ రకంగా తరలిపోవడంపై ఇక్కడ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం దీనిపై కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. పరవాడ మండల స్థానిక ప్రజలు! తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజల గగ్గోలు పెడుతున్నారు.