అల్లూరి సీతారామరాజు జిల్లా , అరకులోయ:
మండలంలోని మాదల పంచాయతీ పరిధి దాబుగుడకి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గిరిజనులు సోమవారం అరకులోయ మండలంలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారి అభిషేక్ కు వినతిపత్రం అందజేశారు. ఆ వినతిలో భాగంగా 2014లో వచ్చిన హుదూద్ తుఫాన్ కారణంగా రహదారి పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. లోతేరు జంక్షన్ నుండి దాబుగుడ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఇంజనీర్ అధికారిని వారు కోరారు.
Post Views: 28