★విద్యా బోధనపై ఆరా
★పిల్లలకు అందిస్తున్న ఆహార మెను పరిశీలన
★ విద్య పట్ల అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు
★కార్పోరేట్ విద్యార్థులతో పోటీపడేలా ఉపాధ్యాయులు కృషీ చెయ్యాలి
★కొత్తబల్లుగుడ ఆశ్రమ పాఠశాలను అకస్మితంగా తనిఖీ చేసిన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
నేటి గదర్, అరకు వాలీ న్యూస్:విద్య పట్ల అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని అరకులోయ Mla రేగం మత్స్యలింగం అన్నారు.
అరకులోయ మండలం పరిధిలో గల కొత్తబల్లుగుడ (G.T.W) ఆశ్రమ బాలికల పాఠశాలను శుక్రవారం ఉదయం 9:00 ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా Mla మత్స్యలింగం ఆ ఆశ్రమ పాఠశాలలో విద్యాబోధన గురించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు .అనంతరం అనంతరం ఆశ్రమ విద్యార్థులకు అందిస్తున్న మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని అధ్యాపకులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కార్పోరేట్ విద్యార్థులతో పోటీపడేలా ఉపాధ్యాయులు కృషీ చెయ్యాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో
కొత్తబల్లుగుడ ఎంపీటీసీ సభ్యులు
స్వభి రామ్మూర్తి ,అధికారులు, తదితరులు ఉన్నారు