ఆటో డ్రైవర్లు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
సీఐ ఇంద్రసేనారెడ్డి
జూలూరుపాడు, జూలై 12, నేటి గద్దర్ : ఆటో డ్రైవర్ లంతా నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని చండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద ఆటో డ్రైవర్లకు మాదకద్రవ్యాల రవాణా, మహిళల భద్రత, సీసీటీవీ, ట్రాఫిక్, బాల్య వివాహాలు తదితర నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు. అదే విధంగా వాహనాలకు సంబంధించిన అన్ని ధృవపత్రాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని డ్రైవర్లకు సూచించారు. లేని యెడల జరిమానాలతో పాటు శిక్షలు కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. యాక్సిడెంట్ సమయాలలో వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు సరిగా లేకపోతే బాధితులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, జూలూరుపాడు, చండ్రుగొండ క్రాస్ రోడ్ అడ్డాలకు చెందిన ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.