★కమిటీల పేర్లతో రైతు భరోసాను కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
★ఉపాధి హామీ కార్మికులకు రెండు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి
★వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మోకాళ్ళ రమేష్ డిమాండ్ చేశారు
నేటి గదర్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు/అశ్వాపురం:ఉపాధి కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించకపోతే వ్యవసాయ కార్మిక సంఘం మరో ఉద్యమం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం మండలం కార్యదర్శి మోకళ్ళ రమేష్ అన్నారు.
అశ్వాపురం మండలంలో రైతులు ముమ్మరంగా వ్యవసాయ పనులు చేస్తున్న నేపథ్యంలో రైతన్నమంతట వ్యవసాయానికి పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎన్నికల మేనిఫెస్టో ఆరు గ్యారెంటీలలో రైతు భరోసా ఉంది .కమిటీల పేరుతో కాలయాపన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం కాలయాపన చేయకుండా రైతులకు తక్షణమే డబ్బులు వేయాలని వ్యవసాయ కూలీలకు కూడా 12000 రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వా వ్యవసాయ కూలీలు గుర్తించలేకపోతున్నారు .ఉపాధి హామీ కార్మికులకు రెండు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించలేదు .ఉపాధి కార్మికులంతా రోజు పని చేస్తానే పూట వెళ్లే పరిస్థితి ఉందని… కాలయాపన లేకుండా తక్షణమే వారి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.