రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో శుక్రవారం రోజు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం అనిత ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు.ఈ మెడికల్ క్యాంపు ద్వారా గ్రామంలో ఉన్న ప్రజలందరికి ముందు జాగ్రత్తగా హెచ్ఐవి, జనరల్ గా బిపి షుగర్ లాంటి అన్ని రకాల పరీక్షలు చేసి వారికి మందులను పంపిణీ చేశారు.ఈ మెడికల్ క్యాంపునకు గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పరీక్షలు చేసుకొని మెడికల్ క్యాంపు ను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అనిత, ల్యాబ్ టెక్నీషియన్ రవి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Post Views: 47