+91 95819 05907

కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలి.

గిరిజన చట్టాలను కాపాడే బాధ్యత జాతీయ గిరిజన కమిషన్ దే. నేటి గదర్ న్యూ, ఖమ్మం ప్రతినిధి,✍️సతీష్ కుమార్ జినుగు :
అటవీ నియమాల చట్టం రద్దు చేయించాలి.
గిరిజన సంఘం కృషి వల్లన కారేపల్లి కి 108 వాహనం ఏర్పాటు కు హామీ ఇచ్చిన కలెక్టర్.
జాతీయ గిరిజన కమిషన్ సభ్యులు జాటోద్ హుస్సేన్ నాయక్ ఏర్పాటుచేసిన అధికారిక సమావేశంలో సమస్యలు వివరించిన తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం. వినతిపత్రం అందించిన గిరిజన సంఘం నేతలు.
ఆశ్రమ పాఠశాల సమస్యలపై గిరిజన సంఘం చేసిన సర్వే గుర్తించిన సమస్యలు పై స్పందించి జాతీయ గిరిజన కమిషన్ సభ్యులు హుటా హుటీన గొల్లగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలను గిరిజన సంఘం నేతలతో కలిసి పరిశీలించిన జాటోత్ హుస్సేన్ నాయక్.

దేశంలో గిరిజన హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని గిరిజన చట్టాలను కాపాడే విధంగా జాతీయ గిరిజన కమిషన్ కృషి చేయాలని తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్ లో జరిగిన జాతీయ గిరిజన కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అధికారికంగా ప్రభుత్వ అధికారుల సమావేశం నిర్వహించారు, గిరిజన సమస్యలపై వివిధ శాఖలతో సమీక్ష నిర్వహించారు, ఈ సందర్భంగా గిరిజన సమస్యలపై భూక్యా వీరభద్రం అనేక అంశాలు కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు, పోడు భూముల సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు, ఆశ్రమ పాఠశాలలో ఉన్న సమస్యను పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని, కోరారు, అటవీ నియమాల చట్టంతో గిరిజన చట్టాలకు భంగం కలిగే ప్రమాదం ఉందని వెంటనే అటవీ నియమాలు చట్టాన్ని రద్దు చేసే విధంగా జాతీయ గిరిజన కమిషన్ కృషి చేయాలని అన్నారు, రాష్ట్రాల విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన విభజన చట్టంలో బయ్యారం హక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదని, ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపట్టి ఏజెన్సీ ప్రాంత గిరిజన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ,అలాంటి కృషి చేయాలని కోరారు, బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేట్ స్కూలుకు కేటాయించే సీట్ల సంఖ్యను పెంచాలని స్కాలర్షిప్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీలో పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని గిరిజన సంఘం జిల్లా నాయకులు ఉసిరికాయలపల్లి మాజీ సర్పంచ్ భానోత్ బన్సీలాల్ కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు, వివిధ అంశాలపై
మాట్లాడారు. గిరిజన సంఘం లేవనెత్తిన అనేక అంశాలపై జిల్లా కలెక్టర్ ముజమీల్ ఖాన్, అటవీశాఖ అధికారులతో మాట్లాడించారు, కారేపల్లి ప్రాథమిక వైద్యశాలకు గిరిజన సంఘ విజ్ఞప్తి మేరకు 108 మంజూరి చేశారు, వినతి పత్రం ఇచ్చిన వారిలో గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా కృష్ణ నాయక్, ధరావత్ నంద్యా నాయక్, జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 14

Read More »

 Don't Miss this News !