+91 95819 05907

సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి జిల్లాకు చెందినవి అవి పక్క జిల్లాలకు మళ్లించడం సరికాదు మా నీళ్లు మాకే కావాలి:సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ముసలి. సతీష్

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం దగ్గర మొదలైన సీతారామ ప్రాజెక్టు నీళ్లు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏ ఒక్క మండలానికి ఇవ్వకుండా పక్క జిల్లాకు తరలించడంలో ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రుల పనితీరని అర్థమవుతుందని *CPI ML న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్* పిలుపునిచ్చారు.
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీలు ఇచ్చిన పిలుపులో ఈరోజు *దుమ్ముగూడెం లక్ష్మీనగరం గ్రామంలో గ్రామంలో* జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల మొత్తం గోదావరి నీళ్లు తరలిస్తుంటే నీళ్లు నిధులు నియామకాల పేరుతో జరిగిన తెలంగాణ ఉద్యమం తో సాధించుకున్న ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా సీతారామ ప్రాజెక్టులో అన్యాయం చేస్తే కొట్లాడి సాధించుకున్న సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఈరోజు ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరావు బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఒక్క ఎకరాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇవ్వకుండా పక్క జిల్లాకు తరలించడంలో అంతర్యమేమిటో చెప్పాలని వారు అన్నారు.ఈ జిల్లాలో జిల్లాలో పాత డిజైన్లు మార్చి కొత్త డిజైన్ తీసుకువచ్చి భద్రాద్రి కొత్తగూడెంకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారన్నారు.సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల హక్కుని సామాజిక సూత్రాలను కూడా మరిచిపోయి చట్టబద్ధత హక్కులను కూడా మరిచిపోయి ఈ ముగ్గురు మంత్రులు నీళ్లను పక్క జిల్లాల తరలించడం అంటే ఇక్కడ ఏజెన్సీ ప్రజలపై వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని వారు అన్నారు.తక్షణమే గోదావరి నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్త పాటు ఏజెన్సీ ప్రాంతాలకు అందించాలని ఏజెన్సీలో ఉన్న భూములను సస్యశ్యామలం చేయాలని ఇక్కడున్నటువంటి ప్రజల్ని రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వారు అన్నారు.అలాగే టేకులపల్లిలో రోళ్ళపాడు రిజర్వాయర్ కడితే ఈ జిల్లా తో పాటు పక్క జిల్లాలకు కూడా ఉపయోగం జరుగుతుందని ఆ క్రమంలో రోళ్ళపాడు రిజర్వాయర్ని నిర్మించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో బుద్దులు సమ్మక్క మడకం సమ్మక్క మడకం సీత శ్రీ శీలం లక్ష్మి దేవి అజయ్ రాజు రమేష్ కనక తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !