★ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న డ్రైనేజీ ఇప్పుడు ఎందుకు గుర్తు కు వచ్చినట్లు?
★వర్షాకాలంలో ప్రజలకు కష్టాలు ఉంటాయని తెలిసి ఎందుకు కూలగొట్టారు?
★అధికారుల అనాలోచిత నిర్ణయం…చిరు వ్యాపారులకు ప్రాణ సంకటం
★వ్యాపారాలు లేక షాప్ ల కిరాయిలు చెల్లించలేక దుకాణాలు ఖాళీ చేస్తున్న చిరు వ్యాపారులు
★బ్లీచింగ్ కి డబ్బులు లేవు. ఐనా ఆ పనులు ప్రారంభం
★డ్రైనేజీ ని వద్దని అధికారులను బ్రతిమలాడిన బెదిరింపు లకు దిగారు.
★ఏజెన్సీ లో ఇల్లు ఎట్లా కట్టారు?అని అన్నది ఎవరు
★నిధుల ఖర్చు ల పై అనుమానం
★ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో నత్తనడకన నడుస్తున్న డ్రైనేజీ పనుల పరిశీలన
★ ఇక్కడి చిరు వ్యాపారస్తులకు జరిగిన అన్యాయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం
★మూత పడిన షాపులకు అధికారులు పరిహారం చెల్లించాలి
★ఇంత పెద్ద వర్క్ టెండర్ లేకుండా అధికారులు ఎలా చేపడతారు?
ఆదివాసీ జిల్లా నాయకులు, సామాజిక కార్యకర్త ఇర్ప రవి ,పాయం ప్రవీణ్ ,మట్టపలి సాగర్ యాదవ్
నేటి గదర్ న్యూస్, మణుగూరు: పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో చిరు వ్యాపారుల పొట్ట కొట్టే విధంగా మండల పంచాయతీ అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయం పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని మణుగూరు కి చెందిన ఇర్ప రవి ,పాయం ప్రవీణ్ ,మట్టపల్లి సాగర్ యాదవ్ లు అన్నారు.ఒక వైపు గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల కొరకు కనీసం బ్లీచింగ్ జల్లడానికి డబ్బులు లేక పంచాయతీ లు ఇబ్బంది పడుతుంటే…ఉన్న ప్రాయంగా డ్రైనేజీ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం పై అనుమానం ఉందన్నారు. ఈ అధికారుల మూలంగా చిరు వ్యాపారులు, ప్రజలు గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న. ఇందులో అవినీతి జరిగే ఆస్కారం ఎక్కువగా ఉందని… జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయనున్నానని తెలపడం జరుగుతుంది