+91 95819 05907

మీ ‘రుణం’ తీర్చుకుంటున్నాం…రైతన్న

★ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపుతున్నాం
★ ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
★ రైతు రుణమాఫీ నంబరాల్లో
★ ట్రాక్టర్ నడిపి జోష్ నింపిన
ఆర్ఆర్ఆర్, తుంబూరు

నేటి గదర్ న్యూస్ , జులై 18 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు)

కాంగ్రెస్ అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వమని… వారి బాగు కోరుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా రుణమాఫీ అమలు చేసి.. వారి రుణం తీర్చుకుంటున్నామని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం నాయకన్ గూడెం, కూసుమంచిలో నిర్వహించిన రైతు నంబరాల్లో ఎంపీ పాల్గొన్నారు. నాయకన్ గూడెం టోల్ ప్లాజా నుంచి కూసుమంచిలోని రైతు వేదిక వరకు రైతులు ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించగా ఎంపీ రఘురాం రెడ్డి, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్లు నడిపి కర్షకుల్లో ఉత్తేజం నింపారు.

*సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం..*

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీని వానరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు రైతులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలలోనే ఇచ్చిన గ్యారంటీలను అనులు చేసిందన్నారు. రైతులకు ఏక కాలంలో రూ.2లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తూ.. మాట నిలబెట్టుకుందన్నారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, వారికి రుణమాఫీ చేయకుండా తాత్సారం చేసిందని విమర్శించారు. రైతులకు వ్యవసాయాన్ని పండుగలా చేసేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో సాగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలని ఎంపీ కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ బాణోత్ శ్రీనివాన్ నాయక్,జొన్నలగడ్డ రవి కుమార్, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, మాజీ ఎంపీపీలు జూకూరి గోపాలరావు, ఎడవెల్లి ముత్తయ్య, రామసహాయం వెంకటరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మట్టి గురవయ్య, నాయకులు కొప్పుల చంద్రశేఖర్ రావు, బజ్జూరి వెంకటరెడ్డి, బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి ,మంకెన వాసు,బారి వీరభద్రం, భీష్మాచారి,బెల్లంకొండ శరత్ ,యడవల్లి రామిరెడ్డి, చాట్ల పరశురామ్, వ్యవసాయశాఖ ఏడీఏ విజయచంద్ర, ఏఓ వాణి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !