రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 18:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ మొదటి విడతలో లక్ష రూపాయలు మాఫీ చేయడం పట్ల రెండో విడత లక్ష రూపాయల మాఫీ ఆగస్టు 15లోగా రైతులకు ఇచ్చిన మాటతో గురువారం రోజు రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలోని రైతు వేదిక నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తూ బస్టాండ్ మీదుగా సిద్దిపేట చౌరస్తా నుండి మెదక్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రాంచందర్ గౌడ్, కార్యదర్శి సుప్రభాత రావు లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని తెలపడానికి ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు..రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు.గత ప్రభుత్వం లక్ష రూపాయలు మాఫీ చేయడానికి మాట ఇచ్చి ఐదు సంవత్సరాలుగా లక్ష రూపాయలను వడ్డీలతో పెంచి మళ్లీ వసూలు చేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైందన్నారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల సంక్షేమ కోసం పనిచేస్తూ ఇక ముందు చాలా కార్యక్రమాలు చేపడుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి,విప్లవ కుమార్,వినయ్ సాగర్ బైరం కుమార్, సుంకోజు దామోదర్, నెహ్రూ నాయక్,చింతల సాయిలు, విరాట్ నరేష్,ఎర్రం సత్యం, తొంటవాలి యాదగిరి,శంకరయ్య సిద్ధ రాములు తదితరులు పాల్గొన్నారు.









