రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 20:- ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ డిఎలను వెంటనే విడుదల చేయాలని టిఅర్ టిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు ఎం.ప్రణీద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రామాయంపేట పట్టణంలో యుపిఎస్ దామరచెరువు పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ,ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ 4 డిఎలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.40% ఫిట్ మెంట్ తో పిఅర్ సిని ప్రకటించాలని కోరారు.లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ లను వెంటనే పదోన్నతుల ద్వారా బర్తీ చేయాలని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ కార్మికులను నియమించాలని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించాలి.ఈ సమావేశంలో నూతనంగా ఎస్ జిటి నుండి ఎస్ఎ లుగా మరియు ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లుగా పదోన్నతి పొందిన
టిఅర్ టిఎఫ్ సంఘ భాద్యులను టి అర్ టి ఎఫ్ రామాయంపేట మండలం నిజాంపేట మండల శాఖల ఆద్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టి అర్ టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐరేని రవీందర్ గౌడ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ప్రభాకర్, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి మోహన శర్మ, రామాయంపేట మండల మాజీ అధ్యక్షులు ఇంద్రసేనాచారి, మాజీ ప్రధాన కార్యదర్శి శేఖర్,నిజాంపేట మండల అధ్యక్షులు నవీన్ రత్నాకర్ జిల్లా నాయకులు నాగేందర్, రమేష్, వెంకట్ రెడ్డి, కిషన్ తదితరులు పాల్గొన్నారు.