నేటి గదర్, జూలై 23,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో,
అలవాల వంశీ, 9052354516 :
గోదావరి వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతాలను ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 24 గంటల కంట్రోల్ రూమ్ ను భద్రాచలం ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గోదావరి వరదలకు సంబంధించిన కంట్రోల్ రూమ్ కు గోదావరి నీటిమట్టం, వరద ప్రభావం హెచ్చు, తగ్గుల వివరాలు తెలుసుకోవడానికి భద్రాచలం డివిజన్ ప్రజలే కాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద తాకిడి గురి అయ్యే జిల్లాల ప్రజలు ఫోన్ ద్వారా తెలుసుకునేందుకు సంప్రదిస్తుంటారని అన్నారు. కంట్రోల్ రూమ్ ను సంప్రదించి వరదలకు సంబంధించిన సమస్యలను సందేహాలను అడిగే ప్రతి వారికి ఓపికగా సమాధానాలు చెప్పాలని తెలిపారు. కంట్రోల్ రూమ్ ను సంప్రదించిన వారి యొక్క ఫోను నంబరు, సమయము, వారి యొక్క పేర్లు, గ్రామము, మండలం, జిల్లా, తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని కంట్రోల్ రూమ్ సిబ్బందికి సూచించారు. అనంతరం రిజిస్టర్ లను రిజిస్టర్ ను పరిశీలించడం ఏపీవో పరిశీలించారు.ఈ కార్యక్రమంలో విధులలో ఉన్న సిబ్బంది రాజశేఖర్, భాస్కర్, శ్రీనివాస్, బుచ్చిబాబు, తదితరులు పాల్గొన్నారు.