చరిత్రలో మొట్ట మొదటి సారిగా ఒకే రోజు 12 కాన్పులు…
డాక్టర్లను అభినందించిన:ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జులై 24:
నైనారపు నాగేశ్వరరావు✍️
9121 463 468
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ 100 పడకల
ఏరియా ఆసుపత్రిలో చరిత్రలో మొట్ట మొదటి సారిగా ఒకే రోజు 12 కాన్పులు నిర్వహించారు.కాన్పులలో 7 మందికి ఆపరేషన్స్ చేయగా 5 గురికీ సాధారణ కాన్పులు జరిగినాయి.అందులో 12 మంది పిల్లలలో 8 మంది మగ పిల్లలు జన్మించగా 4గురు ఆడపిల్లలు జన్మించారు.తల్లీ,బిడ్డలు అందరు క్షేమంగా ఉన్నారని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సునీల్ తెలిపారు.వీరందరూ మణుగూరు చుట్టు ప్రక్కల ప్రాంతాలైన శివలింగాపురం, పినపాక,కరకగూడెం,అశ్వాపురం, పాల్వంచ,జానంపేట నుండి ఇక్కడకి కాన్పూల కోసం రావడం జరిగిందని ఆయన తెలిపారు.ఆసుపత్రిలో కేవలం ఒక గైనకాలజిస్ట్ మరియు ఒక అనస్టటిస్ట్ మాత్రమే ఉన్నారు.వారి పర్యవేక్షణలో కాన్పులు జరిగాయని అన్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డాక్టర్లను ప్రశంసించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,ఇలాగే భవిష్యత్తులో మంచి సేవలు అందించి ఆసుపత్రికి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని హాస్పిటల్ లోని డాక్టర్లను అభినందించారు