★అడవికి పోతే అడ్డుకుంటే మా పశువుల ను సాదుకునేది ఎట్లా?
★మూగజీవాలను కాపాడండి
★పశువుల యజమానుల ఆవేదన
నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి:
చండ్రుగొండ మండలం సీతయ్య గూడెం పంచాయితీ లో ఫారెస్ట్ లోకి మూగజీవాలను మేత కోసం రానివ్వకుండా ఫారెస్ట్ అధికారులు కంచె వెయ్యడం పట్ల మండల బిజెపి నాయకులు చిన్నం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో బుధవారం కలిసి వెళ్లి న ఆయన ఫారెస్ట్ లో మూగ జీవాలు, పశువులను మేతకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మదన్లాల్ కంచ వేయడం సరి కాదన్నారు. మూగజీవాలకి మేత కరువైంది అని ఆవేదన వెలిబుచ్చారు. రైతులతో కలిసి ఫారెస్ట్ అధికారులతో చరవాణి ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తో ఆయన మాట్లాడారు. మూగజీవాలను మేతకు కు వెళ్లడానికి అవకాశం కల్పించాలని, వేసిన కంచెను తొలగించాలని కోరడం జరిగింది .ఆ విషయంలో పై అధికారులు స్పందించకపోతే మూగజీవాల మేత కొరకు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చ రించారు.
ఈ కార్యక్రమంలో సీతయ్య గూడెం రైతులు చింతల లక్ష్మీనారాయణ గారు మాజీ సర్పంచ్ గారు కీసర భద్రయ్య గారు చేకూరి కేశవులు గారు స్థానిక రాంబాబు గారు కే కృష్ణయ్య కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు