★తాటిచెట్టు పై నుండి జారిపడి తీవ్ర గాయాల పాలైన చిర్రా సాంబయ్య గౌడ్
★ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స
★ ప్రైవేట్ ఆసుపత్రికి పోయే స్థోమత లేదు
★ ఓ కుమారుడు ఇటీవలే మృతి
★ దాతల సహాయం కోసం ఎదురుచూపులు
★ ఏజెన్సీ గౌడ్ల దుస్థితి ప్రభుత్వానికి పట్టదా?
నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్: గౌడ్ అన్నకు ఎంత కష్టం వచ్చే. ఇటీవలే తన కుమారుడు చనిపోయి పుట్టడంతా దుఃఖంలో ఉన్న ఆ కుటుంబంపై జాలి లేని దేవుడు …. ఆ కుటుంబాన్ని పగ పట్టినట్టు ఉన్నాడు. కుటుంబ పోషణ కోసం గౌడ వృత్తిని నమ్ముకుని రోజువారి లానే తాటికల్లు తీయడానికి తాటి చెట్టు ఎక్కి జారి తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రాణాలతో పోరాడుతున్నాడు. మెరుగైన వైద్యం అందాలంటే ఆ నిరుపేద కుటుంబానికి దాతల సహాయం తప్పనిసరి.వివరాలు…
బయ్యారం మండలంలోని గందంపల్లి గ్రామ నివాసి చిర్రా సాంబయ్య గౌడ్ శుక్రవారం సాయంత్రం తాటిచెట్టు పై నుండి జారిపడి తీవ్ర గాయాలతో ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.కడునిరుపేద కుటుంబం వారిది.ఆయనకు ఉన్న ఇద్దరు కుమారుల్లో ఒకరు ఇటీవలే మృతి చెందగా,ఉన్న ఒక్క కొడుకు కూలి చేసుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.చిర్రా సాంబయ్య గౌడ్ కి మెరుగైన వైద్యం అవసరం ఉన్నది. డాక్టర్స్ సిఫార్సు మేరకు హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలిస్తున్నారు.వీరి కుటుంబానికి ఆర్ధికంగా సహాయం చేయలనుకున్నవారు,సాంబయ్య కుమారుడికి ఫోన్ పే చేయగలరని సాంబయ్య గౌడ్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కింద పేర్కొన్న నెంబర్కు మీకు తోచిన సహాయం చేసి ఆదుకోండి.
చిర్రా సతీష్ గౌడ్
Phone pay number:7569824619
★★★★
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడుల కోసం చేస్తున్న పథకాలు ఏజెన్సీ గౌడ్ కి వర్తించడం లేదు. ఇలాంటి ప్రమాదాలు చూడు చేసుకున్నప్పుడు పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేక మృత్యుపాలవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఏజెన్సీ గౌడ్స్ కు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఏజెన్సీ గౌడ్స్ ప్రధాన డిమాండ్.