★ఆగస్టు 2, 3 తేదీల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ…
★రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన…9
నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ జులై 28:
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించేందుకు తెలంగాణ ఎన్నికల సంఘం సన్నాహాలు చేపట్టింది.వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన,క్రోడీకరణకు ప్రతి జిల్లా నుంచి అనుభవమున్న ఐదుగురు చొప్పున డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఈ నెల 31 నాటికి ఎంపిక చేసి ఇక్కడికి పంపాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.ఆదిలాబాద్, ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్,జగిత్యాల,కరీంనగర్, పెద్దపల్లి,రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి,ఖమ్మం,జోగులాంబ గద్వాల,మహబూబ్‌నగర్, నారాయణపేట,నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల ఆపరేటర్లకు ఆగస్టు 2న,మిగిలిన జిల్లాల వారికి ఆగస్టు 3న శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.శిక్షణ అనంతరం వారు జిల్లాలకు వెళ్లి అక్కడ మిగిలిన ఆపరేటర్లకు శిక్షణ ఇస్తారని వివరించారు.