నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి జులై 28:
భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ ధర్వాజ నల్లపోచమ్మ అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.లాల్ ధర్వాజ మేకల బండలో కొలువైన శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ బోనాల జాతర సందర్భంగా ఆదివారం ఆయన అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రకు బోనాల జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షులు పొన్న వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి గోల్కొండ నవీన్,మున్నూరుకాపు ప్రముఖులు తూడి ప్రవీణ్,మీసాల చంద్రయ్యలు సాదర స్వాగతం పలికారు.ఎంపీ వద్దిరాజు అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు,వేద పండితులు ఆయన ను ఆశీర్వదించి, పుష్పగుచ్చం ఇచ్చి,శాలువాతో సత్కరించి అమ్మ వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు వెంట గాయత్రి గ్రానైట్స్ కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.