నేటి గదర్ న్యూస్ ప్రతినిధి:
హైదరాబాద్:జులై 28
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల సింగిల్స్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించింది.
221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన మను భాకర్. తొలి రెండు స్థానాల్లో సౌత్ కొరియా అథ్లీట్లు నిలిచారు. హరియాణాకు చెందిన మను భాకర్ 2002లో జన్మించారు.
ఆమె 2018 ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో భారతదేశం తరఫున ఆడి రెండు బంగారు పతకాలు సాధించారు.
2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించారు.
అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. 2020లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డుతో మను బాకర్‌ను సత్కరించింది.
Post Views: 47