★హుకుంపేట ఎస్.ఐ సతీష్ పై కఠిన చర్యలు తీసుకోండి-హుకుంపేట ప్రజాప్రతినిధులు
నేటి గద్దర్ హుకుంపేట న్యూస్
అల్లూరి జిల్లా,హుకుంపేట మండల ఎస్ ఐ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ..అల్లూరి జిల్లా ఏ ఎస్ పీ దీరాజ్ ను కలిసి కోరారు.
ఎస్ ఐ సతీష్ కుమార్,మండల ప్రజలు, ప్రజా ప్రతినిధుల పై దురుసు ప్రవర్తన తో ఇబ్బందులు గురి చేస్తున్నట్లు సర్పంచ్ లు,వైస్ ఎంపీపీ,ఎంపీటీసీ లు ఏ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు,ఈ నెల 24 న
జర్రా కొండ సర్పంచ్ కొర్ర చిట్టిబాబు ను ఎస్ ఐ తన చాంబర్ కు పిలిపించి దుర్భశలాడి జైలుకు పంపిస్తాన నీ హెచ్చరించి ప్రజల ఎదుట అవమాన పరిచారు,గంజాయి పండించే రైతుల తో పాటు,సామాన్యులను కూడ ,వారి వ్యవసాయ భూమి లో నిలబెట్టి ఫొటోలు తీసి కేసులు నమోదు చేసి,బెదిరించి
డబ్బులు ఇస్తే,కేసు పెట్టకుండా,ఇవ్వకుంటే కేసులు బనాయిస్తూ,స్థానిక ప్రజాప్రతినిధుల ను కాదనీ, సమాంతరంగా ఇతరుల తో వ్యవహారం నడిపించడం పై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,ఎస్ ఐ పై కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే హుకుంపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని తెలిపారు.అంతకుముందు హుకుంపేట మండల పరిషత్ జనరల్ బాడీ సర్వసభ్య సమావేశంలో ఎస్ ఐ సతీష్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు.
ఈ కార్యక్రమంలో హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, ఎంపీటీసీలు సాంబే బాలకృష్ణ, సాంబ,సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు కాకరి బొంజిబాబు,బాకూరు సర్పంచ్ బాకూరు వెంకట రమణ రాజు,శోభ కోట సర్పంచ్ శశి భూషణ్ నాయుడు,చీకుమద్దుల సర్పంచ్ సూకూరు బొంజన్న దొర, గన్నేరు పుట్టు సర్పంచ్ సోకేలి క్రిష్ణారావు,తడిగిరి సర్పంచ్ పెనుమల రంజిత్ కుమార్, గత్తుo సర్పంచ్ పాడి పోజురాజు,రాప సర్పంచ్ కొప్పల దేవుడమ్మ, నాయకులు నైని సత్తిబాబు, దూసూరు వెంకట రావు,పాతుని చందన పాత్రుడు,పూజారి సుబ్బారావు,కిల్లో సాంబ,
,కొప్పుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.