ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు.
నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట.
మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం పై కరకగూడెం మండలము చొప్పాల గ్రామంలోని ముసలమ్మ జాతరకు వెళ్ళి వస్తున్న క్రమంలో నర్సాపూర్ (పి ఎ) సమీపంలో ఒక చెట్టుకు వాహనం ఢీ కొట్టిన క్రమంలో దన్నూరి సాయికుమార్ అక్కడికక్కడే మరణించడం జరిగింది. అదే వాహనం పై ప్రయాణిస్తున్న మండలంలోనీ దోమడ గ్రామానికి చెందిన పాయం నితిన్ కు తీవ్ర గాయాలతో బయటపడ్డారు అతనిని స్ధానికులు వెంటనే ములుగు స్ధానిక ములుగు సామాజిక దవాఖానకు తరలించటం జరిగింది అని అక్కడ స్థానికులు తెలిపారు.
Post Views: 266