నేటి గదర్ న్యూ, ఖమ్మం జిల్లాప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు.
రైతు రుణమాఫీ -2024 రెండవ విడుత నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ఖమ్మం కలెక్టర్ కార్యాలయం లో వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం కలెక్టర్ తో పాటుగా పాల్గొన్న రాయల నాగేశ్వరరావు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు కార్యక్రమం చేపట్టిందని ఆయన తెలిపారు.రుణమాఫీ చేయడం తో రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో జులైలో పూర్తి స్థాయిలో నిండని నాగార్జున సాగర్ ఈసారి పూర్తి స్థాయిలో నిండుతుందని ఆయన చెప్పారు.రుణమాఫీ అయిన రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని అర్హులైన వారికి బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని ఆయన అన్నారు..
Post Views: 29