నేటి గదర్ న్యూస్ జులై 30: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.
వైరా మున్సిపాలిటీ. వర్షాకాలా న్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులైన మలేరియా,డెంగ్యూ వంటివి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారంలో రెండు రోజులు అందరూ డ్రైడే పాటించాలని వార్డు కౌన్సిలర్ మాదినేని సునీత ప్రసాద్ పేర్కొన్నారు. డ్రై డే సందర్భంగా మంగళవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో వార్డ్ కౌన్సిలర్ మాదినేని సునీత ప్రసాద్ మరియు మున్సిపాలిటీ సిబ్బంది ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులో దోమల నివారణకు మలాథిన్ మందును స్ప్రే చేయించినారు మురికిగుంటల్లో ఆయిల్ బాల్స్ ను వేయించినారు ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేసినారు వార్డు పరిధిలో శానిటేషన్ ఇబ్బందులు ఉన్నచో మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ నరసింహారావు ఆర్పి నాగమణి ఆశా వర్కర్ రేణుక స్ప్రేయింగ్ బాయ్స్ నాగరాజు అనిల్ పాల్గొన్నారు.