+91 95819 05907

మోసం చేసిన అక్క….అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

★రేవంత్ మాటతో సబిత భావోద్వేగం

★రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్

★సమస్యలపై ప్రశ్నిస్తే టార్గెట్ చేశారు

కాంగ్రెస్, దిగజారుడు రాజకీయాలు చేస్తుంది

మాజీ మంత్రి సబిత

నేటి గద్దర్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్ మేడ్చల్ జిల్లా బ్యూరో ఆగస్టు 1;

హైదరాబాద్ లో తెలంగాణ అసెంబ్లీ
సమావేశాలు జరుగుతున్న వేళ.. మాజీ మంత్రి, మహే శ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భానో ద్విగానికి లోయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సబితా ఇంద్రా రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. అరుగా.. రేవంత్ రెడ్డిని ఆహ్వానించి, ఆశీర్వదించినట్టు సబితా వివరించారు. ఆమె ఆహ్వానించిన విషయం తెలిపించేనని.. కానీ తనను ఆమె తీవ్రంగా మోసం చేసిందంటూ కీలక ఆరోపణ చేశారు. తెలం గాణలో అసెంబ్లీ సమావేశాలు దాడీ వేడీగా జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో.. మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు సబిత, చర్చలో భాగంగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న క్రమంలో.. రేవంత్ రెడ్డి పరోక్షంగా సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలు చేశారు. కేటీఆర్ మీ వెనుక ఉన్న అక్కల మాటలు వింటే.. జూబ్లీ బస్టాండ్లో కూర్చోవల్సి వస్తుందంటూ సబితా ఇంద్రారెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సభలో ఒక్కసారిగా దుమారం రేపాయి.

ఈ క్రమంలోనే.. మిగతా మంత్రులు కూడా ఇదే తరహాలో విమర్శలు చేయటంతో.. సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఎందుకు తనను టార్గెట్ చేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని.. ఒక అక్కగా సంతోషంగా ఆహ్వానించినట్లు గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డికి తనపై ఎందుకు అంత కక్ష అని అడిగారు. ఆరోజు పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశాకిరణం అవుతావని చెప్పానన్నారు. కష్టపడితే సీఎం కూడా అవుతావని ధైర్యం చెప్పాను. మనస్ఫూర్తిగా ఆశీర్వదించానని సబితా ఇంద్రారెడ్డి వివరించారు. సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. సబితక్క తనను పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. 2019లో మల్కాజిగిరిలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తనను కోరిందన్నారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే అండగా ఉంటానని సబిత మాట ఇచ్చారని.. కానీ కాంగ్రెస్ తనను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆమె బీఆర్ఎస్లో చేరిపోయారన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ను వదిలి బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి తీసుకున్నారన్నారు. తమ్ముడిగా తనును మోసం చేశారు కాబట్టే ఆమెను నమ్మొద్దని కేటీఆర్కు చెప్పానని రేవంత్ రెడ్డి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం చెలరేగింది. రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో.. సభను కాసేపు వాయిదా వేశారు. ఈ సమయంలో అసెంబ్లీ లాబీలో సబితా ఇంద్రా రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సభాసాక్షిగా ఒక మహిళను ఇంతగా అవమానిస్తారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు సమయం ఇస్తే.. తన గురించి మొత్తం వివరిస్తానన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల మాట్లాడితేనే.. తనను టార్గెట్ చేశారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపణలు చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !