నేటి గదర్, ఆగస్టు 2, హైదరాబాద్ ప్రతినిధి :
ఎస్సీ ఎస్టీల వర్గీకరణ తీర్పుపై తెలంగాణ హైకోర్టు ఎస్సీ మాదిగ అడ్వకేట్స్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం హైకోర్టు ఆవరణంలో ఈ సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. వర్గీకరణ వలన ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నిండిన ఉన్నాయని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ ల వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వారి పేర్కొన్నారు. ఇలాంటి సంచలన తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు కు హైకోర్ట్ అడ్వొకేట్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లే నాగేశ్వర రావు, అడ్వకేట్ జనరల్ A. సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్స్ T.రజనీ కాంత్ రెడ్డి, ఇమ్రాన్ ఖాన్ లను కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాట్ల మణి కుమార్, చాట్ల మధు, మిద్దే లెనిన్, లింగంపల్లి రవీందర్, Dr. N. రవికుమార్, నల్లగట్ల లక్ష్మినారాయణ, దాసరి అనిల్ కుమార్, పిరంగళ్ళ గణేష్, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.