+91 95819 05907

US:అమెరికాకు మీరే ఆయువుపట్టు:సీఎం రేవంత్ రెడ్డి

🔸ఇక తెలంగాణకు రండి.. పెట్టుబడి పెట్టండి
🔸అభివృద్ధిలో భాగస్యామ్యం పంచుకొండి

న్యూజెర్సీలో ప్రవాసులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి

రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఆదివారం జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళానికి వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా దారిపొడవునా భారీ ర్యాలీతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్ గా లభిస్తుంది..’ అని ఎన్నారైలలో ఉత్సాహం నింపారు.

“గత సంవత్సరం టీపీసీసీ అధ్యక్షుని హోదాలో అమెరికాకు వచ్చాను. పదేండ్ల పాటు సాగిన దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానని చెప్పాను. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను” అన్నారు.

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఇప్పటికే రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీతో పాటు, ఇన్ పుట్ సబ్సిడీగా రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు వంట గ్యాస్ సిలిండర్, నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు, ఉపాధ్యాయులకు పదోన్నతులు, విద్యార్థులకు నాణ్యమైన విద్య పథకాలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ప్రారంభం మాత్రమే అని.. భవిష్యత్తు ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.

తమ పరిపాలనపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు తావు లేదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకు వస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన, నైపుణ్యాల వృద్ధికి అందులో సమానమైన ప్రాధాన్యమిస్తామని చెప్పారు.

‘ఎన్నికల ముందు మాపై ఎంతో విష ప్రచారం జరిగింది.. గిట్టని వాళ్లందరూ అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాదని అన్నారు. వచ్చినా అది ఉండనే ఉండదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందంటూ లేని పోని అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాం. అబద్ధాలకోరుల మాటలు తప్పని మరోసారి నిరూపిస్తాం. హైదరాబాద్‌ను భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతాం…’ అని సీఎం ప్రకటించారు.

మీ నైపుణ్యాలు, మీ ప్రతిభా పాటవాలతో అమెరికాను పటిష్టంగా, సంపన్నంగా మార్చారని ప్రవాసులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇకపై తెలంగాణకు మీ సేవలు అందించాలని స్వాగతించారు. తెలంగాణలో మెట్రో కోర్ అర్బన్ తో పాటు , సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ముఖ్యులతో సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి మాస్టర్‌ ప్లాన్ తో హైదరాబాద్ ను అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు మీరందరూ కలిసి రావాలని ప్రవాసులకు సీఎం పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని ఎన్సారైలు అభినందించారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలను అందరూ ప్రశంసించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనే ప్రచారంలో ప్రభుత్వంతో కలిసి పాల్గొంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే పాటలు, నృత్యాలతో కూడిన భారీ ప్రదర్శనను చిన్నారులు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియాన్ మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలన్న మా కోరిక నెరవేరింది. ఇప్పుడు రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేయడానికి మనమందరం కష్టపడాలి…’ అన్నారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, వ్యాక్సిన్‌లు, హెల్త్‌కేర్‌, అర్టిఫిషియల్ రంగాల్లో తెలంగాణ బలమైన స్థావరంగా ఎదగాలని ఆకాంక్షించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజా పాలన విజయోత్సవాల వాహనాన్ని అడ్డుకున్న జనం?

గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తరిమి కొడుతున్న ప్రజలు సీఎం గారి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద

Read More »

ఆదివాసీ సంఘల జేఏసీ సమావేశాన్ని విజయవంతం చెయ్యండి.

నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని రాళ్ళవాగు(పెద్దమ్మతల్లి గుడి)సమీపంలోని ఆదివాసీ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం గురువారం ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ మండల అధ్యక్షులు పోలెబోయిన.వెంకటనారాయణ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏజెన్సీ

Read More »

మాలల సింహాగర్జన ను విజయవంతం చేయండి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఐ ఎమ్ ఎల్ ఏ ఖమ్మం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాలల

Read More »

ఖమ్మం 53వ డివిజన్లో బిజెపి సభ్యత్వాలు పూర్తి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఈరోజు 53వ డివిజన్లో బిజెపి సభ్యతాలు 1000 పూర్తి చేసి ఖమ్మం జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహసమావేశంలో

Read More »

మైండ్ స్పేస్ బిల్డింగ్ పై నుండి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

హైదరాబాద్ – మాదాపూర్లో నవీన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేశాడు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి

Read More »

వడియారం గ్రామ శివారులో ఎండు గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 20:-మెదక్ జిల్లా చేగుంట 44వ జాతీయ రహదారి వడియారం గ్రామ శివారులో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో

Read More »

 Don't Miss this News !