◆సమస్యల నిలయంగా మారిన కేజీబీవీలు
◆ ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపంవల్లనే ఇదంతా
నేటి గదర్ న్యూస్, ఆగస్టు 5:
చండ్రుగొండ కేజీబీవీ హాస్టల్ సమస్యల నిలయంగా మారిందని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆ
సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ స్తనిక చండ్రు గొండ కేజీబీవీ లో విద్యార్థులు అనేక సమస్యలతో సతమాతం అవుతున్నారని వర్షాలకు సరైన మౌలిక సదుపాయాలు పరిసరాలు పారిశుధ్యం సరిగా లేక విద్యార్థులకు విష జ్వరాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారని అన్నారు. అదేవిధంగా హాస్టల్లో విద్యార్థుల సౌకర్యార్థం మూత్రశాలలు హస్తవ్యస్తంగా ఉన్నాయని కనీసం వర్కర్లు లేక విద్యార్థులే కార్మికులుగా మారి పనులు చేసుకునే విధంగా ఉందని ఆయన అన్నారు. విద్యను అభ్యసించే విద్యార్థులు చదువుకోటానికి వచ్చారా లేక బానిసలుగా పనిచేయటానికి వచ్చారా అని వంశీ ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఉన్నత అధికారులు డీఈఓ జి సి డి ఓ ఎంఈఓ గార్లు తక్షణమే స్పందించి చండ్రుగొండ కేజీబీవీ హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని లేకపోతే జరగబోయే పరిణామాలకు సంబంధిత అధికారులే బాధ్యులవుతారని వంశీ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బాలాజీ రామ్ చరణ్ హెమంత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు