+91 95819 05907

త్వరలో వివింట్ ఫార్మా రూ. 400 కోట్ల పెట్టుబడి

★తెలంగాణ జీనోమ్ వ్యాలీలో ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు సంసిద్ధత

తెలంగాణలో పెట్టుబడులకు పేరొందిన కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది.

హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా (Vivint Pharma) కంపెనీ ముందుకొచ్చింది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం వివింట్ (Vivint Pharma) కంపెనీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో వివింట్ (Vivint Pharma) కంపెనీ ఆర్ అండ్ డీ కేంద్రం ఉంది. సుమారు రూ. 70 కోట్లతో నెలకొల్పిన ఈ సదుపాయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా హైదరాబాద్ లో తన మొదటి తయారీ కర్మాగారాన్ని స్థాపించనుంది.

జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివింట్ ఫార్మా (Vivint Pharma) ముందుకు రావటంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.

తెలంగాణలో అన్ని పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని, జీనోమ్ వ్యాలీ ఔషద కంపెనీలను తప్పకుండా ఆకర్షిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

ఈనెల 29వ తేదీన కరీంనగర్ లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొననున్న బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా

Read More »

సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శిగా గడ్డం స్వామి

*కార్యదర్శి వర్గంలో కార్యదర్శి తో పాటు మరో ఆరుగురికి చోటు….* *23 మందితో నూతన పట్టణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…..* *పలు తీర్మానాలను ఆమోదించిన 8 వ సిపిఐఎం మహాసభ* భద్రాచలం పోరాటాల గడ్డ

Read More »

వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరిండెంట్ కు ఫిర్యాదు:యువజన కాంగ్రెస్

– ప్రజల పక్షాన వారి సమస్యలపై వినతి పత్రం అందజేసిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్య సురేష్ నాయక్ – ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు

Read More »

ప్రజా పాలన విజయోత్సవాల వాహనాన్ని అడ్డుకున్న జనం?

గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తరిమి కొడుతున్న ప్రజలు సీఎం గారి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద

Read More »

ఆదివాసీ సంఘల జేఏసీ సమావేశాన్ని విజయవంతం చెయ్యండి.

నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని రాళ్ళవాగు(పెద్దమ్మతల్లి గుడి)సమీపంలోని ఆదివాసీ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం గురువారం ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ మండల అధ్యక్షులు పోలెబోయిన.వెంకటనారాయణ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏజెన్సీ

Read More »

మాలల సింహాగర్జన ను విజయవంతం చేయండి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఐ ఎమ్ ఎల్ ఏ ఖమ్మం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాలల

Read More »

 Don't Miss this News !