★సీసీ రోడ్లు లేక బురదతో అధ్వానంగా తయారైన రోడ్లు..
★మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకోవాలంటున్న గ్రామస్తులు..
నేటి గదర్ న్యూస్ , ఆగస్ట్ 8 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
ఏళ్లు గడుస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి.. కానీ ఆ గ్రామంలో రోడ్ల దుస్థితి మారలేదు… ఆ రోడ్లపై నడవాలంటే యాతనే.. కాలు భయట పెట్టడానికి కూడా అవకాశం లేకుండా పూర్తిగా బురదమయ్యం అయినాయి… ఇక వివరాల్లోకి వెళితే కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు లేక దారులు అధ్వానంగా తయారయ్యాయి. ఎన్నో సంవత్సరాలుగా సీసీ రోడ్ల కోసం అర్జీలు పెడుతూనే ఉన్న ఫలితం మాత్రం శూన్యం. సీసీ రోడ్ల మంజూరు చేయాలని గత ప్రభుత్వాలకు ఎన్ని సార్లు విన్నవించుకున్న గత పది సంవత్సరాల్లో కేవలం 4 ,5 సీసీ రోడ్లు మాత్రమే వచ్చాయి. దీంతో సీసీ రోడ్లు లేక బురద రొడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిందంటే పాదాచారులు ,వాహనదారులు ,బడికి వెళ్ళే చిన్న పిల్లలు బురదలోనే ఇబ్బందులు పడుతూ వెళ్ళాల్సిన పరిస్థితి . బురద వలన వాహనదారులు వాహనంపై నుండి పడి గాయాలపాలైన సంఘటనలు ఉన్నాయి..ప్రతి సంవత్సరం తురక గూడెం గ్రామానికి సీసీ రోడ్ల మంజూరులో ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంది.. పాలకుల చిన్న చూపు గ్రామ అభివృద్ధిని దూరం చేస్తుంది.. ఒకనాటి ఆదర్శ గ్రామం నేడు బురదతో కొట్టిమిట్టులాడుతుంది.
*మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలి..*
గత పాలకులు సీసీ రోడ్ల కోసం సరైన నిధులు కేటాయించకపోవడంతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు…ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాకా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో తురకగూడెం గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లకు ప్రతిపాదనలు పంపమని ఆదేశాలు ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తురక గూడెం గ్రామంపై ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామంలోని అన్ని మట్టి రోడ్లకు సీసీ రోడ్లు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.. ఇప్పటికే గ్రామంలో అవసరైమైన సీసీ రోడ్ల కోసం ప్రతిపాదనలు గ్రామ కాంగ్రెస్ నాయకులు అధికారులకు ఇవ్వడం జరిగింది.. త్వరగా సీసీ రోడ్లు మంజూరు చేయాలని బురదతో యాతన పడుతున్న గ్రామస్తుల కష్టాలు తీర్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీ కోరుతున్నారు..