+91 95819 05907

ఆదివాసీ హక్కుల సంరక్షణకై సమరం చేద్దాం…

TAGS రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా…

గిరిజన సంప్రదాయ డోళీ, నృత్యాలతో భారీ ర్యాలీ ప్రదర్శన…

నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి ఏటూర్ నాగారం ఆగస్టు 9:

అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ సందర్భంగా ఏటూరునాగారంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయ డోళీ, నృత్యాలతో మండల పరిషత్ కార్యలయం నుండి ఐటిడిఎ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్,గొంది రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాలు ప్రతి ఏటా నిర్వహించుకోవడమే తప్ప ఆదివాసీల గూడేలల్లో సమస్యలను పట్టించుకునే పాలకుల లేరని ఆయన మండిపడ్డారు.ఆదివాసి దినోత్సవం అంటే ఏమిటో తెలియని ఆదివాసీలు ఇంకా ఉన్నారని ఆయన అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలను పరిష్కరించకుండా ద్వంద వైఖరి ఆలంబిస్తుందని ఆరోపించారు.పోడు సాగు భూములను సేద్యం చేస్తున్న ఆదివాసీలపై కర్కషంగా బిజెపి,కాంగ్రెస్ పార్టీలో వ్యవహరిస్తూ వారిపై ఫారెస్ట్ అధికారులను ఉసుగోల్పుతూ,దాడులకు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు.
పోడు భూములకు పట్టాలు,ఆదివాసీ హక్కులు సంరక్షణ కోసం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం స్ఫూర్తితో ఆదివాసీలు సమరం సాగించాలని పిలుపునిచ్చారు.జిల్లాలో సాగులో ఉన్న ప్రతి ఎకరానికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.వలస ఆదివాసి గుడాల ప్రజలను గిరిజనులుగా గుర్తించి గిరిజన కుల సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఐటీడీఏ గిరిజన గూడాలను అభివృద్ధి చేయాలని అన్నారు.వలస ఆదివాసి గుడాలలో తాగునీటి సౌకర్యం కల్పించాలని,గిరిజన గూడాలలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి హెల్త్ క్యాంపులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాలు అన్నింటికీ రోడ్లు, కరెంటు సౌకర్యం కల్పించాలని అన్నారు.షెడ్యూల్డ్‌ ప్రాంతంలో జీవో 3 ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలని అన్నారు. ఆదివాసీ తెగల వాయిద్య పరికరాలు, వారి నృత్యాలు ప్రభుత్వం ప్రోత్సాహం లేక అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివాసీ ప్రాంతాలలోకి టూరిజం ప్రవేశించాక ఆదివాసీ కళలు వ్యాపార సరుకులుగా మారిపోయని పేర్కొన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పాటించాలని కోరారు.నేడు జరుగుతున్న ఉత్సవాలు పాలకవర్గాల అవసరాల కోసమే తప్ప ఆదివాసీలను కాపాడడానికి కాదని అన్నారు.నిజమైన ఆదివాసీ దినోత్సవం,ఆదివాసుల ‘అవసరాలు- ఆకాంక్షలు’ నెరవేర్చేదిగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జెజ్జర దామోదర్,దుగ్గి చిరంజీవి,తోలేం కిష్టయ్య,చిరంజీవి,వంక రాములు, గ్యానం వాసు,కృష్ణ బాబు, సౌమ్య,శాంత కుమారి,ప్రవీణ్, కమల,వీరబాబు,రాజు,భద్రయ్య,సచిన్, దేవా,లోకేష్,నాగరాజు తదితరుల పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !