కూసుమంచి – ఖమ్మం బస్ సర్వీసులు పెంచాలి..
నేటి గదర్ న్యూస్ , ఆగస్ట్ 10 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని మహిళామణులు బాగానే ఉపయోగిస్తున్నారు.. శనివారం రెండవ శనివారం అవడం సెలవు దినం కావడంతో దూరాన ఉండి హాస్టల్ లో చదువుతున్న తమ పిల్లలను కలవడం కోసం కూసుమంచి సెంటర్లో చాలా మంది మహిళలు ఆర్టీసీ బస్ కోసం ఎదురు చేశారు. ఈలోపు సూర్యాపేట బస్ రాగానే పెద్ద సంఖ్యలో ఉన్న మహిళలు ఒక్కసారిగా పరుగెడుతూ బస్ ను ఎక్కే ప్రయత్నం చేశారు.. కానీ అప్పటికే బస్ పూర్తిగా నిండి సీట్లు లేకపోయినా చాలా సేపటికి బస్ రావడంతో అందరూ అదే బస్ ను ఎక్కలని ఆరాటం పడడంతో కొంత ఇబ్బందులు పడ్డారు.. మహిళలు అలా ఇబ్బందులు పడుతూ బస్ ఎక్కడం చూసిన జనాలు ఆశ్చర్య పోవడం వారివంతైంది. ఉచిత బస్ సర్వీస్ బాగుందని మెచ్చుకుంటూనే కూసుమంచి – ఖమ్మం బసుల సర్వీసులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు…అదే సమయంలో నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేశారు.. ఈ సందర్భంగా ఆ మహిళా మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఉచిత బస్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలిపారు.. ప్రతి ఆదివారం కొత్తగూడెం ,భద్రాచలం ,సత్తుపల్లి ,పాల్వంచ ,కారేపల్లి , వంటి దూర ప్రాంతాల్లో వారి పిల్లలు ప్రభుత్వ గురుకులాల్లో చదువుకుంటున్న తమ పిల్లలను చూడడానికి పైసా ఖర్చు లేకుండా ప్రయత్నిస్తున్నాం.. దాని వలన మిగిలిన డబ్బులతో తమ పిల్లలకు మంచి పండ్లు , అవసరమైన నోట్స్,పెన్నులు తీసుకెళ్తున్నాం అని సంతోషం వ్యక్తం చేశారు.. కానీ అదే సమయంలో బస్ ల సర్వీసులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు..సీట్లు దొరరక కొందరు ఫుట్ పాత్ పై నిలబడి ప్రయాణిస్తున్నారు… ఫుట్ పాత్ ప్రయాణం ఎంత ప్రమాదకరమో తెలిసిన నిర్లక్ష్యంగా అలాగే ప్రయాణిస్తున్నారు… ఈ విషయంపై స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టి సారించాలని,ప్రయాణికుల ఇబ్బందులకు పూర్తి పరిష్కారం చూపాలని కోరుతున్నారు… బస్ సర్వీసులు పెంచితే కానీ ప్రమాదకరంగా ప్రయాణించే సమస్య పోతుందని అంటున్నారు…