సిల్వర్ రాజేష్ నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా
ప్రతి సోమవారం కార్యక్రమానికి వచ్చి సమస్యలకు పరిష్కారాలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ప్రజలకు సూచించారు
212 ప్రజావాణి దరఖాస్తులు స్వీకరణ.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వివిధ సమస్యలపై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలనీ సూచించారు.
వివిధ ప్రజలు పెట్టుకున్న అర్జీలను వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు-10 ధరణి భూసమస్యలు-63
పింఛన్లుకొరకు-35,రుణమాఫీ-16, ఉపాధి కోసం 05
ఇతర సమస్యలు-83
ప్రజలు ప్రజావాణిలో దరఖాస్తుల సమర్పించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.