నేటి గదర్ న్యూస్ , ఆగస్ట్ 16 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
కూసుమంచి మండలం గంగబండతండ పంచాయతీ శివారు రావిచెట్టుతండా సమీపంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ పెండింగ్ పనులు జరుగుతున్నాయి. కాలువ పెండింగ్ పనులు పూర్తి చేయాలని సమీప రైతుల కోరిక మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే స్పందించి సంబంధిత ఇరిగేషన్ అధికారులను ఆదేశించి త్వరగా పనులను పూర్తి చేయాలని సూచించారు. దీంతో పనులు ముమ్మరంగా జరుగుతుండగా ఆ పనులను కూసుమంచి క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కూసుమంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పెట్టుకున్న రైతుల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొళ్ళంపల్లి సుధాకర్ రెడ్డి, పెండ్ర అంజయ్య, చిలకబత్తిని రామారావు, చాట్ల పరుశురామ్, కనతాల నాగయ్య, అర్వపల్లి జనార్థన్, మాజీ ఎంపీపీ యడవల్లి ముత్తయ్య, బోమ్మగాని వెంకటేశ్వర్లు, భిక్షం నాయక్ తదితరులు పాల్గొన్నారు.