రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 21:- బంగ్లాదేశ్ లో హిందువులపై అకారణంగా జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బంద్ కు భారతీయ జనతా పార్టీ యువమోర్చా, సంఘ్ పరివార్ తో పాటు యువజన సంఘాలు బంద్ కు పిలుపునిచ్ఛాయని రామాయంపేట పట్టణ బిజెపి సీనియర్ నాయకులు శంకర్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా హిందువులపై జరుగుతున్న అరాచకాలను గళమెత్తి నిరసన తెలపాలని అన్నారు.భారతీయులు ఎక్కడ ఉన్నా భారతదేశం మరో పేరు హిందూ దేశం అని ఇక్కడ ఉన్నవారు హిందువులే అని గ్రహించాలని అన్నారు.బంగ్లాదేశ్ అంతరిద్దంలో హిందువులను బలి పశువులు చేయడం చాలా దారుణం అన్నారు.ప్రపంచంలోని మానవహక్కుల సంఘాలు, సంస్థలు హిందువులపై జరిగి మారణాహోమాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ దేశంలో సెక్యులర్ అని చెప్పుకునే జాతీయ ప్రాంతీయ పార్టీలు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.ఇందుకు పట్టణంలోని అన్ని వ్యాపార సముదాయాలు మూసివేయాలని, వాణిజ్య సంఘాలు, విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు అన్ని కుల సంఘాలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.