రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 23:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి, కోమటిపల్లి తండా, రామాయంపేట తండాలను మున్సిపల్ నుండి వేరు చేసి నూతనంగా గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ మండల తహసిల్దార్ రజనీకుమారికి శుక్రవారం రోజు గ్రామస్తులు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపాలిటీలో ఉన్న కోమటిపల్లి మరియు రెండు తండాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని అన్నారు.మున్సిపల్ క్రింద ఉండి మా గ్రామం తండాలలో కనీసం ఉపాధి హామీ పనులు కూడా చేసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు.అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు ఇంటి బిల్లులు నల్లబిల్లులు అధికంగా వస్తుండడంతో నిరుపేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో కట్టలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కోమటిపల్లి గ్రామాన్ని రెండు తండాలను వేరు చేస్తామని గత ప్రభుత్వంలో అప్పుడున్న ఎమ్మెల్యే గ్రామపంచాయతీగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి చేయలేకపోయరని పేర్కొన్నారు. ఇప్పటికైనా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ఈ విషయంలో చొరవ తీసుకొని మా గ్రామాన్ని నూతనంగా గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ స్వామి,కె. ప్రవీణ్ కుమార్,బండారి రాజాగౌడ్, సురేష్ నాయక్, రాములు, సురేందర్, ఆర్.పరశురాములు ఆర్.గట్టు, స్వామి, మల్లేశం, లక్ష్మయ్య, బిక్షపతి, రమేష్ , రాజు,బాలమల్లు,నరేష్ , వడ్డరి సంతోష్, నర్సింలు గ్రామస్తులు యువకులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.