రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 27:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద ఉన్న ప్రభుత్వ బోరు గుంత ప్రమాదకరంగా మారడంతో “అభం శుభం తెలియని చిన్నపిల్లలు” సైతం మైమరచి అక్కడ ఆటలు ఆడుతున్నారు.ఏ క్షణాన ఏమవుతుందోనని అక్కడి ప్రజలు భయపడుతున్నారు.ఈ విషయంలో పలుమార్లు గ్రామ సర్పంచ్ పంచాయతీ సెక్రటరీకి బోరు గుంత పూడ్చాలని పలుమార్లు గ్రామస్తులు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదు.ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా బోరు గుంతకు హ్యాండిల్ బోరు బిగించాలని పలు మార్లు చెప్పిన పట్టించుకున్న నాదుడే కరువయ్యారు.ఈ విషయంలో అదే గ్రామానికి చెందిన తుడుం పెంటయ్య వాకిట్లో ఉన్న బోరు గుంత డిస్మెంటల్ చేయమని ప్రజావాణిలో ఫిర్యాదు చేసి రెండు ప్రజావాణిల తర్వాత మండల తహసిల్దార్ ను అడుగగా మీరు ఇచ్చిన దరఖాస్తు ఎంపీడీవోకు పంపామని బోరు గుంత విషయంలో వారు తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు.అయినప్పటికీ నాలుగు ప్రజావాణి కార్యక్రమాలు జరిగినా ఇంతవరకు ఏ అధికారులు చర్య తీసుకోలేదు.ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి బోర్ గుంతను పూడుస్తారా లేక,బోరు గుంతకు హ్యాండిల్ బోరు బిగిస్తారా వేచి చూడాల్సిందే…??