*విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా*
*విద్య యొక్క ప్రామాణిక నైపుణ్యాన్ని పెంచడమే ధ్యేయంగా యూనివర్సిటీ ఏర్పాటు*
*విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండేలా.. !*
*ఏ యూనివర్సిటీ కల్పించని నూతనమైన కోర్సులను ప్రవేశపెట్టాం*
*విద్యార్థుల నైపుణ్యత ప్రామాణికమే లక్ష్యంగా అంకితభావంతో కూడిన మార్గదర్శకత్వం కలిగిన విద్యాసంస్థ*
*దేశంలో అతి తక్కువ నామమాత్రంతో ఖర్చుతో విద్యాబోధన*
*విశ్వవిద్యాలయ స్థాపనతో తన మూడు దశాబ్దాల కల నేడు నెరవేరింది*
– చైతన్య యూనివర్సిటీ
ఫౌండర్ అండ్ చైర్మన్
సి.పి రెడ్డి
నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్, హైదరాబాద్ బ్యూరో(ఆగస్టు, 28);
చదవాలనే ఆశయం ఉన్నా అవగాహన లేక చాలా మంది విద్యార్థులు వెనుకబడుతున్నారు. సరైన మార్గదర్శనం లేక ఏదో ఒక కాలేజీలో చేరి..!
అర్హత లేని ఫ్యాకల్టీ చెప్పే పాఠాలు విని..! చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు రాక ఎందరో విద్యార్థులు ఇబ్బందికుబడిన సంఘటనలను ఎన్నో ఉన్నాయి.
*లక్షల మంది విద్యార్థులకు ఆదర్శ* చైతన్య
లక్షలాది మంది విద్యార్థులు ఉద్యోగ ఉపాధి లేక తల్లి దండ్రుల మీద ఆధారపడడం చూస్తున్నాం.
భవిష్యత్ బాగుండాలంటే ఇంటర్ తరువాత ఇప్పుడు మీరు ఎన్నుకున్న కోర్సులే మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని అవగాహన సదస్సులో తెలిపారు.ఇందుకోసం రంగారెడ్డి జిల్లా మొయినాబాదులో చైతన్య యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థులకు మొదటి సంవత్సర విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
*కొత్త విద్యార్థులకు నూతన అవగాహన సదస్సు*….!
సుమారు రెండు వేల మంది సదస్సు కు హాజరయ్యారు. నేటి ఆలోచనే రేపటి భవితకు బాటలు వేస్తుంది. ఉన్నత విద్య అందించే కాలేజీల్లో చేరితే లక్ష్యం దానంతట అదే నెరవేరుతుంది. కోఖరికిలం, సిలబస్ రెండింటికీ ప్రాధాన్యమిస్తూ విద్యార్థి తోడ్పాటుకు విద్యా సంస్థల ఎంపిక చాలా ముఖ్యమని చైతన్య యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చైర్మన్ సి పి రెడ్డి విద్యార్థులకు దిశా నిర్దేశించారు.
ఈ క్రమంలో విద్యార్థులు తీసుకున్న కోర్సులలో ఎలా చదవాలి..!
చైతన్య యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతను ఇందులో అందించే కోర్సుల వివరాలను హైదరాబాద్ నడి ఒడ్డు లో ఉన్న ఏ ప్రైవేట్ యూనివర్సిటీ నాణ్యమైన విద్య , అతి ప్రామాణికంగా ఫీజులతో విద్యనందించే ఏ యూనివర్సిటీ లేదని కేవలం చైతన్య యూనివర్సిటీకే ఆ విశ్వసనీయత దక్కుతుందని తెలిపారు.
*ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దడమే యూనివర్సిటీ లక్ష్యం*
కేవలం విద్యార్థుల బంగారు బాటలు వేయడం కోసమే యూనివర్సిటీ ఏర్పాటు జరిగిందని విద్యార్థులకు మంచి భవిష్యత్తు కోసం అనేకమైన కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు.ఇంటర్ తర్వాత అనేకమంది విద్యార్థులు తప్పటడుగులు వేసి అందాకారం కి వెళ్లారని తెలుస్తుందని…!
వారి జీవితాలు బంగారు భవిష్యత్తు ఉండాలని చైతన్య యూనివర్సిటీ ప్రత్యేక చొరవ తీసుకొని వారికోసం అనేక కొత్త ఉపాధి చూపించే కోర్సులు ప్రవేశపెట్టి , దానితో విద్యార్థులు నూతన ఉత్సాహంతో ఆయా కోర్సులలో అర్హత సాధించి 100కు 100% ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందే విధంగా దానిని అనుభవగ్లైన నిపుణుల చేత రూపొందించామని సిపి రెడ్డి విద్యార్థులకు తెలిపారు.
*తెలంగాణలో ఏకైక అగ్రగామి యూనివర్సిటీ*
తెలంగాణలో ‘ చైతన్య యూనివర్సిటీ’ విద్యార్థులను చైతన్య పరుస్తూ వారికి, ప్రతిభావంతంగా తయారు చేస్తూ సమాజంలో చైతన్య యూనివర్సిటీ విద్యార్థులు అనేల కొత్త ఓరఓడిక మీరే తయారు చేస్తారని , మీ కోసమే యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థుల శ్రేయస్ కు , వారి భవిష్యత్తు లక్ష్యంగా చైతన్య యూనివర్సిటీ రూపొందించామని , ఈ యూనివర్సిటీ ఏర్పాటు కోసం భాగస్వాములైన ప్రతి ఒక్క ప్రొఫెసర్లకి సభాముఖంగా పేరుపేరునా ధన్యవాదాలు సిపి రెడ్డి తెలియజేశారు.
*విద్యా నైపుణ్యత ప్రమాణాలను పాటించడమే చైతన్య సూత్రం*
చైతన్య యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన స్థానం ఉందని . నాణ్యతా ప్రమాణాలతో కూడిన బోధన, వందశాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నది. ఒక్కో విద్యార్థికి బహుళ సంఖ్యలో ఉద్యోగాల ఉత్తీర్ణత సాధించిన మంచి అవకాశాలుతో పాటు మంచి ప్యాకేజీ తో సెలక్ట్ అవుతున్నారు అని చెప్పారు.
*అగ్రగామి ప్రొఫెసర్లు ఎక్కడా లేని విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు*
ఉత్తమ బోధన, ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్స్ అందించే ఉన్నత విద్యా సంస్థలను ఎంపిక చేసుకోవాలి. ఐఐటీ, ఎన్‌ఐటీలకు దీటుగా న్యాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌తో అత్యుత్తుమ ప్రమాణాలతో విద్యాబోధన చేపడుతున్నాం.
*చైతన్యకు పోటీ అంతర్జాతీయ యూనివర్సిటీలు*
ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం గర్వంగా చెబుతున్నానని ఇంతటి గర్వం నాకు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రొఫెసర్లకి సభాముఖంగా వందనాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
*అన్ని రంగాలను ఏకీకృతం చేసిన యూనివర్సిటీ*
అతి తక్కువ కాలంలోనే చైతన్య యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ శాస్త్ర, సాంకేతిక, వైద్య విజ్ఞాన, పారామెడికల్, ఫార్మసీ , వైజ్ఞానిక, ప్రత్యేకమైన గుండె సంబంధమైన రంగాల్లో, అనస్థీషియా టెక్నీషియన్ (ఆపరేషన్ టెక్నీషియన్) కోర్సులను వెలుగులోకి తెచ్చిన ఏకైక మొట్టమొదటి యూనివర్సిటీ చైతన్య యూనివర్సిటీ మాత్రమే.
*విద్యార్థులకు నూతనమైన ఇంటర్ షిప్ సేవలు*
ఇక్కడి విద్యార్థులు బీటెక్ తృతీయ సంవత్సరంలోనే ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్స్‌కు ఎంపికవుతున్నారు. విద్యాలక్ష్మి పోర్టల్‌తో విదేశీ స్కాలర్‌షిప్‌లు, విద్యారుణాలు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాం. నిత్యం లెక్చర్ ట్యుటోరియల్స్, ప్రాక్టీస్ చేయిస్తున్నాం. తరగతులు ముగియగానే టీ హబ్‌కు వెళ్లి అధికారులు, ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహిస్తున్నాం. ఇలాంటి ఉత్తమ ఫ్యాకల్టీ, ప్రమాణాల తో కూడిన చైతన్య మీరు ఎంపిక చేసుకోవడం చాలా సంతోషకరమని విద్యార్థులకు తెలిపారు.
మిగతా కాలేజీలతో పోలిస్తే ఫీజు నామమాత్రపు ఫీజు తీసుకుని నాణ్యతమైన విద్యను అందించే ఏకైక యూనివర్సిటీ దాంతోపాటు ప్లేస్‌మెంట్ ప్యాకేజీ చాలా లభించాయి.
*ఐటీ రంగానికి దీటైన విద్య*…..!
మొదటి సంవత్సర విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించిన సదస్సు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. చైతన్య యూనివర్సిటీ లో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుతో , సైబర్ సెక్యురిటీ, డిజిటల్ నెట్‌వర్క్, ఎలక్ట్రికల్, , నెట్‌వర్క్స్ అప్లికేషన్లపై , క్లౌడ్ కంప్యూటింగ్ , డాటా స్ట్రక్చర్ పూర్తిస్థాయి అవగాహన వచ్చిందని విద్యార్థులు కేవలం ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ గౌరిశెట్టి శంకర్ లింగం తో మాత్రమే ఇది సాధ్యమవుతుందని విద్యార్థులు ప్రత్యేక ప్రతినిధితో తెలియజేశారు.
చైతన్య యూనివర్సీటీలో చేరి మంచిగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఇంజనీరింగ్ రీసెర్చ్ డీన్ అధిపతి ప్రొఫెసర్ శంకర్ లింగం విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు వస్తాయో అవి ఎలా నెరవేర్చుకోవాలో విద్యార్థులకు అరటిపండు ఒలిచి పెట్టినంత సులభంగా విద్యార్థులకు చెప్పారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక ప్రతినిధితో తమ భావాలను వ్యక్తపరిచారు. ఇలాంటి యూనివర్సిటీలో మా పిల్లలం చేర్పించడం చాలా సంతోషకరంగా ఉందని తమ యొక్క భావాలు ప్రతినిధితో పంచుకున్నారు. ఇలాంటి అనుభవిజ్ఞన ప్రొఫెసర్ యూనివర్సిటీలో ఉంటే విద్యార్థులకు కోర్స్ అనంతరమే సమయం వృధా అసంభవం అని విద్యార్థి తల్లిదండ్రులు తమ యొక్క సందేశాన్ని ఇచ్చారు.
చైతన్య యూనివర్సిటీ రాను రాను విద్యార్థులకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అనేకమైన కొత్త కొత్త కోర్సులను తేవడానికి సంసిద్ధంగా ఉందని అకాడమిక్ డీన్ రాజు విద్యార్థులకు సూచించారు. చైతన్య యూనివర్సిటీ విద్యార్థులకు బాసటగా భవిష్యత్‌కు తోడుగా నిలుస్తుంది.. పేర్కొన్నారు.
*అంతర్జాతీయ కోర్సుల ప్రమాణికం*
ప్రపంచంలో అగ్ర యూనివర్సిటీలతో పోటీపడేలా సిద్ధం చైతన్య యూనివర్సిటీ విద్యార్థులను తయారు చేస్తుందని గర్వంగా చెప్తున్నామని ఇంతటి గొప్ప యూనివర్సిటీ తెలంగాణ గడ్డమీద ఏర్పాటు చేయడము చాలా సంతోషకరం ఉందని సభాముఖంగా సీపీ రెడ్డి తెలిపారు. విద్యార్థుల మార్గదర్శకత వహిస్తున్న ప్రొఫెసర్ లందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేశారు.
ఉన్నత చదువులపై ఇచ్చిన గైడ్‌లెన్స్ వారి భవిష్యత్‌కు తోడుగా నిలుస్తాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే వంద శాతం లక్ష్యాన్ని చేరకుంటారనడంలో సందేహం లేదు. యూనివర్సిటీకి ప్రొఫెసర్ లే వచ్చి ఉన్నత చదువులపై అవగాహన కల్పించడం అభినందనీయం.
– చుంచు కుమార్, పరిశోధక విద్యార్థి
చక్కని ప్రణాళికతో ముందుకుసాగాలి..
విద్యార్థులు చక్కని ప్రణాళికతో ముందుకుసాగి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి. సరైన సమయంలో మంచి నిర్ణయాన్ని తీసుకొని ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకోవాలి. నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికబద్దంగా చదవాలి. విద్యార్థులకు మంచి గైడెన్స్‌ను అందించారు. జాతీయ స్థాయిలో చైతన్య యూనివర్సిటీ ఎంతో పేరుగాంచింది.
*లక్ష్యం వైపు అడుగులు వేయాలి*..!
లక్ష్యం వైపు అడుగులు వేస్తాను. యూనివర్సిటీ వారు కల్పించిన అవగాహన ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్‌లో ఏదైనా సాధించాలంటే మొదటగా మార్గాన్ని ఎంచుకోవాలని తెలుసుకున్నాను. లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన పెరిగింది. చైతన్య లో చేరిన విద్యా కుసుమాలను ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడమే మా యొక్క ఫ్యాకల్టీ ఏకైక కాంక్షని తెలియజేశారు.
– సంగీత మొదటి సంవత్సరం విద్యార్థిని
ఈ యొక్క సదస్సులో యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్స్లర్ గౌరీశెట్టి శంకర్ లింగం అక్కడ మీకు డీన్ రాజు రిజిస్టర్ రవీందర్ చైతన్య యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్స్లర్ సి పి రెడ్డి, ప్రొఫెసర్ సాత్విక రెడ్డి, ఈ విక్రం రెడ్డి అన్ని రంగాల హెచ్వోడీలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేశారు.