నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
నేషనల్ హెల్త్ మిషన్ పనిచేస్తున్న 17514 ఉద్యోగులందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి , సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు లకు ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి , ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం నరసింహ తో వినతి పత్రం అందజేశారు. 510 జీవోలో మిస్ అయిన 4000 మంది ఉద్యోగులందరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామి ఇచ్చినట్లు …దాదాపు 3 గంటల పాటు cm తో చర్చలు జరిపినట్లు తెలిపారు. పంజాబ్ ,మణిపూర్ మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో ఆల్ క్యాడర్స్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేశారని, అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి కి విన్నవించడం జరిగింది. ఈ విషయంపై స్పందించిన ముఖ్యమంత్రి మూడు నెలలలోగా మిగిలిన రాష్ట్రాలలో ఉన్న జీవో లను తెప్పించుకొని స్టడీ చేసి, చట్టపరమైన సాధ్యసాద్యాలను పరిశీలించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానన్నారు.